'యానిమ‌ల్‌'పై విమ‌ర్శ‌ల‌కు తెలివిగా ఇచ్చేశాడు!

వీట‌న్నిటికీ సందీప్ రెడ్డి వంగా త‌న‌దైన శైలిలో స‌మాధాన‌మిచ్చారు.

Update: 2024-11-25 11:30 GMT

రణబీర్ కపూర్ న‌టించిన 'యానిమ‌ల్' పాన్ ఇండియా స్థాయిలో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 800 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే బాక్సాఫీస్ విజ‌యంతో సంబంధం లేకుండా ఈ సినిమా తీవ్ర విమ‌ర్శ‌ల‌ను కూడా మూట‌గ‌ట్టుకుంది. హింస‌, ర‌క్త‌పాతం, స్త్రీ ద్వేషం అనే కోణాల్లో చాలా విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. స‌మాజానికి చెడు సందేశం ఇచ్చింద‌ని విమ‌ర్శించారు. వీట‌న్నిటికీ సందీప్ రెడ్డి వంగా త‌న‌దైన శైలిలో స‌మాధాన‌మిచ్చారు.

ఇప్పుడు ర‌ణబీర్ క‌పూర్ దీనికి స‌మాధాన‌మిచ్చారు. 2024 ఇఫీ ఉత్స‌వాల్లో పాల్గొన్న అత‌డు మాట్లాడుతూ తాను అన్నిర‌కాల పాత్ర‌ల్లో న‌టించాల‌నుకుంటున్న‌ట్టు స‌మాధాన‌మిచ్చారు. ఆదివారం గోవాలో జరిగిన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కి రణబీర్ హాజరయ్యారు. ఈ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ''మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నటులుగా సమాజంపై సానుకూల ప్రభావం చూపే సినిమాలను తీసుకురావడం మా బాధ్యత'' అని అన్నారు. అయితే స్టార్‌గా నాకు క‌మర్షియ‌ల్ విజ‌యం చాలా ముఖ్యం. విభిన్న శైలి పాత్ర‌ల‌లో న‌టించడం అవ‌స‌రం. వైవిధ్య‌మైన‌ పాత్రలను పోషించాల‌నుంది.. అని ర‌ణ‌బీర్ తెలిపారు.

తన తండ్రి రాజ్ కపూర్ జీవితంపై బయోపిక్ తీయాలనే కోరికను కూడా ర‌ణ‌బీర్ ఇఫీ వేదిక‌గా వ్యక్తం చేశాడు. రిషీక‌పూర్ బ‌యోపిక్ గురించి చాలా మందితో మాట్లాడాన‌ని, దానిపై భ‌న్సాలీ సహా పలువురు ద‌ర్శ‌క‌నిర్మాతలతో మాట్లాడానని రణబీర్ అన్నారు. బ‌యోపిక్ చాలా సంక్లిష్టతలను కలిగి ఉంటుంది. సవాళ్ల‌తో కూడుకున్న‌ది. ''ఒక వ్యక్తి జీవితంలో విజయాన్ని లేదా ఉన్నత స్థాయిని హైలైట్ చేసేది కాదు. నిజంగా తెర‌పై ఒకరి జీవితాన్ని నిజాయితీగా చిత్రీకరించాలి. హెచ్చు త‌గ్గులు, జీవ‌న్మ‌ర‌ణ‌ పోరాటాలు చూపించడం.. బంధాల‌ను నిజాయితీగా చూప‌డం చాలా ముఖ్యం'' అని రణ‌బీర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం అత‌డు సంజయ్ లీలా భ‌న్సాలీతో కలిసి ల‌వ్ అండ్ వార్ అనే చిత్రంలో ర‌ణ‌బీర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి భార్య ఆలియా కూడా ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మ‌రో హీరోగా విక్కీ కౌశ‌ల్ న‌టిస్తున్నారు.

Tags:    

Similar News