నటసింహం నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో దసరా కానుకగా విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ చేసే అవకాశాలు లేకపోవడంతో.. ఇప్పుడు పండుగ సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి 'అఖండ' మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే 'అఖండ' చిత్రాన్ని అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్టుగా దసరా సమయానికి బాలయ్య సినిమా కంప్లీట్ అవుతుందో లేదో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయని తెలుస్తోంది. 'అఖండ' సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ కేటాయించాల్సి ఉందట. భారీ VFX వర్క్స్ చేయాల్సి ఉండగా.. అక్టోబర్ ఫస్ట్ వీక్ నాటికి ఈ సినిమా రెడీ కాకపోవచ్చనే రూమర్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.
'అఖండ' సినిమా పనులు సెప్టెంబర్ నాటికి పూర్తయితే, కచ్చితంగా దసరా స్పెషల్ గా విడుదల అవుతుందని చెప్పవచ్చు. ఒకవేళ అప్పటికి పూర్తి కాకపోతే మాత్రం బాలకృష్ణ - బోయపాటి ఒక సువర్ణావకాశాన్ని కోల్పోయినట్లే. ఎందుకంటే ప్రస్తుతానికి ఫెస్టివల్ సీజన్ లో పాన్ ఇండియా చిత్రాలు, ఇతర పెద్ద సినిమాలేవీ వచ్చే సూచనలు కనిపించడం లేదు. 'కొండ పొలం' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి సినిమాలు మాత్రమే పండుగను టార్గెట్ చేస్తున్నారు.
క్రిష్ జాగర్లమూడి - వైష్ణవ్ తేజ్ ల కాంబోలో రూపొందిన 'కొండ పొలం' చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక అఖిల్ అక్కినేని - బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో వస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ని అదే టైం లో రిలీజ్ చేయాలని గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. బాలకృష్ణ చిత్రానికి ఇవన్నీ పెద్ద పోటీ కాకపోవచ్చు. అందుకే దసరా సీజన్ 'అఖండ' కు చాలా అనువైనదని చెప్పవచ్చు.
ఒకవేళా 'అఖండ' చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయలేకపోతే మాత్రం డిసెంబర్ లో కొత్త తేదీ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. సంక్రాంతి సీజన్ ను ఆల్రెడీ నాలుగు పెద్ద సినిమాలు బ్లాక్ చేసుకున్నాయి. క్రిస్మస్ సీజన్ కోసం 'పుష్ప' 'ఏజెంట్' వంటి సినిమాలు కర్చీఫ్స్ వేసాయి. అందుకే బాలయ్యకు దసరా బెస్ట్ సీజన్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.
కాగా, 'అఖండ' చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఫ్యాక్షనిస్ట్ గా అఘోరా గా రెండు పాత్రల్లో నటసింహం సందడి చేయనున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్ - జగపతి బాబు - పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
'సింహా' 'లెజెండ్' చిత్రాలు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య - బోయపాటి కలయికలో రాబోతున్న ''అఖండ'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - రెండు టీజర్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. త్వరలో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.