మన తెలుగు ఇండస్ర్టీలో ఇంతే. అభిమానులకు లిమిట్స్ ఉండవ్. భజన బ్యాచ్ కు బౌండరీలు ఉండవ్. ఇప్పుడు దర్శకుడు రామ రాజు అండ్ హీరో నాగశౌర్య ఎలాగైతే నిహారికను నేటి తరం ''సావిత్రి'' అని పొగిడేశారో చూస్తుంటే.. అందరికీ ఒక్కసారిగా అఖిల్ అక్కినేని గుర్తుకురాకుండా ఉండడు. పైగా గతంలో నిహారిక అండ్ అఖిల్ కలసి ఒక షార్టు ఫిలిం కూడా చేశారు. పదండి అసలు సంగతి ఏంటో చూద్దాం.
తన కెరియర్ లో 50 సినిమాలు చేశాకనే.. చిరంజీవి ''సుప్రీమ్ హీరో'' ''మెగాస్టార్'' వంటి బిరుదులను అందుకున్నారు. దాదాపు 20 సినిమాలు చేశాకనే.. మహేష్ బాబు ''సూపర్ స్టార్'' అనిపించుకోవడం మొదలెట్టాడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే స్టయిలిష్ యాంటిక్స్ తో కాస్త ముందుగా స్టార్డమ్ అందుకుంది. అయితే.. తరువాతి కాలంలో వచ్చిన ఎన్టీఆర్ - చరణ్ - బన్నీలకు.. చాలా సినిమాలు చేస్తే కాని రేంజ్ రాలేదు. కాని అఖిల్ ను మాత్రం.. తొలిసినిమాకే ఫ్యూచర్ సూపర్ స్టార్.. తదుపరి మహేష్ బాబు.. అంటూ ఆకాశానికి ఎత్తేశారు భజన బ్యాచ్ లు. దానితో అఖిల్ చుట్టూ హైప్ ఏర్పడి.. అతన్ని ఓ కొత్తకుర్రాడిలా కాకుండా.. బాగా అనుభవమున్న స్టార్ లా చూశారు. దానితో తొలిసినిమా ఢాం అనేసింది. అందుకే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''నా తొలిసినిమాలో నేను ఇంతకంటే బాగా చేయలేదు. టైమ్ పడుతుంది'' అంటూ నాగార్జున మొత్తుకున్నారు. కట్ చేస్తే.. అఖిల్ రెండో సినిమాను సెలక్ట్ చేసుకోవడానికి పుణ్యకాలం వెళ్ళిపోతూనే ఉంది. భజన బ్యాచ్ లను నమ్మాలా?? లేకపోతే తనకు సరిపడే సినిమాలు చేయాలా?? అనే విషయంపై కుర్రాడికి క్లారిటీ రావట్లేదని ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు మెగా డాటర్ నిహారిక దగ్గరకు వద్దాం. ఆమె సావిత్రా కాదా అనే విషయం పక్కనెట్టేస్తే.. ఇప్పుడు ''నీహా నీహా'' అంటూ ఆడిటోరియంలో వినిపిస్తున్న ఆ అరుపులు చూస్తుంటే.. ఆమెను క్వీన్ సినిమాలో కంగన రనౌత్.. కహానీ సినిమాలో విద్యా బాలన్.. అలా మొదలైందిలో నిత్మా మీనన్.. అంతఃపురంలో సౌందర్య.. రేంజులో అభిమానులు హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనికి తగ్గట్లు.. అప్పుడు ఎలాగైతే అఖిల్ ను కొన్ని మీడియాలు ఆకాశానికి ఎత్తేశాయో.. ఇప్పుడు అలాగే నిహారికను కూడా ఎత్తేస్తున్నాయి. ఒకవేళ రేపు సినిమా తేడా పడితే ఏంటి? పైగా రామరాజు గతంలో తీసిన సినిమా బీభత్సమైన హిట్టేం కాదు. అలాగే నాగశౌర్యకూ హిట్లు లేవు. కంపోజర్ సునీల్ కశ్యప్ సినిమాలూ ఫ్లాపులే. మరి ఫ్లాప్ బ్యాచ్ అంతా కలసి.. నిహారిక చుట్టూ ఏర్పడిన హైప్ ను అందుకుంటుందా?
ఇలా హైప్ తో తెరపైకి వచ్చిన నాగ చైతన్య.. అఖిల్ .. సాయిధరమ్ తేజ్.. సాయికుమార్ కొడుకు ఆది.. అందరివీ డెబ్యూ సినిమాలే. అన్నీ ఫ్లాపులే. అందుకే మరి జాగ్రత్త సుమీ!!