షూటింగ్స్ వరకే.. నో స్టూడియో??

Update: 2016-12-02 11:30 GMT
అక్కినేని యంగ్ హీరో అఖిల్.. బ్రాండ్ అండార్స్ మెంట్స్ లో కూడా దూసుకు పోతుంటాడు. ఇంకా ఒక్క సినిమా  హీరో మాత్రమే అయినా.. అది కూడా ఫ్లాప్ అయినా.. స్టార్ హీరోల రేంజ్ లో యాడ్స్ చేసేస్తుంటాడు. రీసెంట్ గా వైజాగ్ లో షాపింగ్ మాల్ ప్రారంభానికి వచ్చిన ఈ యంగ్ హీరో.. వైజాగ్ లో స్టూడియో ప్రపోజల్స్ లేవంటూ కామెంట్ చేశాడనడం సంచలనం అవుతోంది.

హైద్రాబాద్ లో అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా వైజాగ్ లో అక్కినేని నాగేశ్వరరావు పేరిట అక్కినేని స్టూడియో ఏర్పాటు చేసే ప్రపోజల్ ఉందా అనే ప్రశ్న ఎదురైతే.. 'తెలుగు సినిమా ఇండస్ట్రీ హైద్రాబాద్ లో చాలా కాలం నుంచి ఉంది. ఇప్పటికిప్పుడు కదిలే అవకాశాలు లేవు. తాతయ్య పేరు మీద వైజాగ్ లో స్టూడియో నిర్మాణంపై ప్రస్తుతం ఎలాంటి అలోచనలు లేవు. అయితే.. వైజాగ్ లో షూటింగ్స్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. విశాఖ చాలా అందమైన నగరం' అంటూటూ అఖిల్ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక అఖిల్ రెండో సినిమా కోసం ఏర్పాట్లు ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై..  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనండగా.. గ్రాండ్ రీలాంఛ్ ఈవెంట్ ఏర్పాటు చేసి మరీ ఈ మూవీని స్టార్ట్ చేయనున్నాడు నాగ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News