అఖిల్‌ బాబూ..మనస్సెందుకు మారిందో...

Update: 2015-08-21 08:03 GMT
మొన్నటివరకు దసరా బరిలో నేనున్నా అన్నాడు అఖిల్‌. ఆ తరువాత సడన్‌ గా మనస్సు మార్చుకున్నాడు. అదేమంటే నాకు మా నాన్నగారి డిసెంబర్‌ సెంటిమెంట్‌ బాగా వర్కయ్యేలా ఉంది.. సో, నేను డిసెంబర్‌ లో వస్తానంటూ ట్రేడ్‌ వర్గాలకు సెలవిచ్చాడు. కాని ఇంతలోనే ఏమైందో ఏంటో.. సీన్‌ మొత్తం మారిపోయింది.

లేదు మేం అక్టోబర్‌ 21న దసరా కానుకగా దసరా సెలవలన్నీ ముగిసిపోయాక వస్తున్నాం అంటూ సెలవిచ్చాడు హీరోకమ్‌ నిర్మాత నితిన్‌. సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయిపోయింది. కేవలం 3 పాటలు మాత్రమే షూట్‌ చేయాలి. వాటి కోసం ఫారిన్‌ లో ఓ రెండు తీస్తారట, మిగిలిన మరో పాటను ఇండియాలో సెట్‌ వేసి మాస్‌ మసాలాతో మత్తెక్కిస్తారట. ఈ విషయాలని కన్‌ ఫాం చేసిన నితిన్‌ 21నే సినిమా అనేది కూడా చెప్పేశాడు. అయితే అసలు ఇప్పడు సడన్‌ గా మరోసారి డిసెంబర్‌ నుండి అక్టోబర్‌ కు ఎందుకొచ్చినట్లు?

నిజానికి ఈ సినిమా తొలి కాపీని ఇంకా చూడలేదుగాని... ఇప్పటివరకు తాను చూసిన వర్షెన్‌ తో అసలు కింగ్‌ నాగార్జున సంతృప్తి చెందలేదని ఒక రూమర్‌ ఉంది. అయితే అందులో నిజం లేదట. దర్శకుడు వివి వినాయక్‌ గతంలో ఎలాగైతే బెల్లంకొండ శ్రీనివాస్‌ ను లాంచ్‌ చేశాడో.. సేమ్‌ టు సేమ్‌ అలాగే ఇప్పుడు అఖిల్‌ ను కూడా ఒక సూపర్‌ హీరో, సూపర్‌ కామెడీ స్టార్‌ తరహాలో చూపించాడట. డమ్మీ రీ-రికార్డింగ్‌ తో సినిమాను చూసిన నాగ్‌ ఫుల్లుగా థ్రిల్‌ ఫీలయ్యి వెంటనే రిలీజ్‌ డేట్‌ లాక్‌ చేయమని సెలవిచ్చారట. అది సంగతి.
Tags:    

Similar News