సినిమా రిలీజ్ అయితే హీరోకి నిర్మాతకు చాలా టెన్షన్ ఉంటుందనే చెప్పాలి. మిగతా వారు అంతగా బాధపడకపోవచ్చు. ముఖ్యంగా హీరోకి సక్సెస్ అవసరం అనే టైమింగ్ లో భయం చాలానే ఉంటుందని చెప్పాలి. దీంతో ప్రమోషన్స్ చేసి సినిమా రేంజ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటారు. అయితే ప్రస్తుతం అఖిల్ కూడా చాలా టెన్షన్ లో ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు.
నాగార్జున అయితే ఎప్పుడు లేని విధంగా సినిమాకు హైప్ క్రియేట్ చేస్తున్నారు. నార్మల్ గా తనకి సంబంధించిన సినిమాల కోసం నాగ్ ప్రమోషన్స్ చేయడం మాములే కానీ ఈ సారి హలో కోసం ప్రమోషన్స్ డోస్ చాలా పెంచేశాడు అనే టాక్ వినిపిస్తోంది. రానా తో అఖిల్ మొన్నటి వరకు అమెరికాలో ప్రమోషన్స్ చేశాడు. కానీ అక్కడ అనుకున్నంతగా రెస్పాన్స్ ఏమి రాలేదు. ఇక ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీని నాగ్ దింపేశాడు. చిరంజీవి - రామ్ చరణ్ హలో ప్రీ రిలీజ్ వేడుకకి విచ్చేశారు. ఇక మొన్నటివరకు షూటింగ్ లతో బిజీగా ఉన్న కొత్త కోడలు సమంత కూడా మొగుడు నాగ చైతన్యతో కలసి ఈ ఈవెంటుకు వచ్చింది. కొంచెం మరిది సినిమా కోసం తనవంతు సాయంగా కృషి చేస్తోంది సమంత. అలాగే తమ్ముడి కోసం అన్నయ్య చైతు కూడా విచ్చేశాడు.
సినిమా బావుంటే తప్పకుండా ప్రేక్షకులే మౌత్ టాక్ తో పిచ్చ ప్రమోషన్స్ చేస్తారు. కానీ నాగ్ మాత్రం ఎదో ఒక హీరోతో కాకుండా కుదిరినంత మందితో ప్రమోషన్స్ చేయిస్తున్నాడు. ఎందుకు సారూ ఈ ఓవర్ డోసూ? హైప్ ఓవరైతే అసలుకే మోసం వచ్చేస్తుంది.