నానిని చూసి భయపడటమా..సీన్ రివర్స్!

Update: 2017-12-12 06:13 GMT
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కు ‘హలో’ సినిమా ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అఖిల్ తొలి సినిమా ‘అఖిల్’ డిజాస్టరైన నేపథ్యంలో ఈ సినిమా కచ్చితంగా ఆడి తీరాలి. లేదంటే అతడి కెరీర్ ప్రమాదంలో పడుతుంది. పైగా ఈ సినిమాకు నాగార్జున రూ.40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేశాడు. ఆ మొత్తం రికవర్ కావాలంటే సినిమా చాలా బాగా ఆడాలి. ఇదంతా దృష్టిలో ఉంచుకుని ‘హలో’ను పోటీ లేకుండా క్రిస్మస్ వీకెండ్లో రిలీజ్ చేయించాలని నాగ్ అనుకున్నాడని.. అందుకోసం నాని సినిమా ‘ఎంసీఏ’ రిలీజ్ డేట్ మార్పించే ప్రయత్నం చేశాడని వార్తలొచ్చాయి. దీని గురించి తెలిసి సూపర్ ఫాంలో ఉన్న నానిని చూసి ‘హలో’ టీం భయపడుతోందన్న గుసగుసలు కూడా వినిపించాయి.

కానీ నాగార్జున-దిల్ రాజు మధ్య నిజంగా చర్చలు జరిగాయో లేదో కానీ.. ఎంసీఏ.. హలో సినిమాల మధ్య పోటీ తప్పదని తేలిపోయింది. ఐతే క్రిస్మస్ వీకెండ్ దగ్గర పడుతుండగా.. పరిస్థితి చూస్తే మాత్రం ‘హలో’కే అంతా అనుకూలంగా కనిపిస్తోంది. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో పాజిటివ్ ఫీలింగ్ ఇస్తోంది. ప్రమోషన్లు కూడా జోరుగా చేస్తూ హైప్ పెంచుతున్నారు. కానీ ‘ఎంసీఏ’ విషయంలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. ఇది మామూలు సినిమాలా అనిపిస్తోంది. దర్శకుడు వేణు శ్రీరామ్ తొలి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’ ఫ్లాప్ అయిన నేపథ్యంలో అతడిపై ప్రేక్షకులకు ఏమంత భరోసా లేదు. ఆశ్చర్యకరంగా దేవిశ్రీ ప్రసాద్ ‘ఎంసీఏ’ ఆడియో విషయంలో యావరేజ్ ఔట్ పుట్ ఇచ్చాడు. ఇది మైనస్ అయింది. పైగా ఈ సినిమాకు సరైన ప్రమోషన్లు కూడా చేయట్లేదు. ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్ వస్తే.. తర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేస్తే పరిస్థితి మారుతుందేమో చూడాలి. ఇప్పటికైతే పరిస్థితి చూస్తే ‘హలో’ను చూసి ‘ఎంసీఏ’ టీమే భయపడేలా ఉంది.
Tags:    

Similar News