ఒక భాషలో ఒక డిజాస్టర్ మూవీతో పరిచయమైతేనే ఆ కథానాయికకు ఆ తర్వాత అవకాశాలు కష్టంగా మారతాయి. అలాంటిది మూడు భాషల్లో ఒక కథానాయిక నటించిన తొలి మూడు సినిమాలూ డిజాస్టర్లయితే ఆమె భవితవ్యం ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు. ఐరెన్ లెగ్ అని ముద్ర వేసేసి.. ఆ తర్వాత అవకాశాలు ఇవ్వడం మానేస్తారు ఫిలిం మేకర్స్. ముంబయి భామ సాయేషా విషయంలో ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ అలాగే చేసింది. తెలుగులో ఆమె నటించిన ‘అఖిల్’ డిజాస్టర్ కావడంతో మళ్లీ ఇంకో అవకాశం దక్కలేదు. హిందీలో సాయేషా తొలి సినిమా ‘శివాయ్’ కూడా డిజాస్టరే. అక్కడ కూడా తర్వాత అవకాశాలు లేవు.
ఐతే తమిళంలో సాయేషా తొలి సినిమా ‘వనమగన్’ కూడా ఫ్లాప్ అయినప్పటికీ ఆమెకు అక్కడ వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. ‘వనమగన్’ ఆడకపోయినా అందులో సాయేషా పెర్ఫామెన్స్ నచ్చి విజయ్ సేతుపతి లాంటి క్రేజీ హీరో సరసన ‘జుంగా’ అనే సినిమాలో అవకాశం కల్పించారు ఆమెకు. ఇప్పుడు ఆర్య హీరోగా తెరకెక్కబోయే ఓ భారీ ప్రాజెక్టులోనూ సాయేషా ఛాన్స్ పట్టేసింది. ఈ చిత్రాన్ని జ్నానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంతోష్ దర్శకుడు. మొత్తానికి సాయేషా తొలిసారి కథానాయిక నటించిన టాలీవుడ్ ఆమెకు టాటా చెప్పేసింది. సొంతగడ్డ అయిన బాలీవుడ్ కూడా వద్దు పొమ్మంది. కానీ కోలీవుడ్ మాత్రం ఆమెను నెత్తిన పెట్టుకుంటుండటం విశేషమే.