అక్కినేని అఖిల్ - దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఒక లవ్ స్టొరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'Mr. మజ్ను' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.. రెండు రోజుల ప్యాచ్ వర్క్ తప్ప దాదాపు టాకీ పార్ట్ అంతా పూర్తయిందట.
ఈ సినిమాలో మెజారిటీ భాగాన్ని లండన్ లోని బ్యూటిఫుల్ లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ గురించి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ "సినిమా అవుట్ పుట్ తో మేం హ్యాపీ. రెండు ఫైట్ సీక్వెన్సులు.. రెండు పాటల చిత్రీకరణ మాత్రం పెండింగ్ ఉంది. త్వరలో రిలీజ్ కు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తాం" అన్నారు. మొదట్లో ఈ సినిమాను డిసెంబర్ 21 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ 'అంతరిక్షం.. 'పడి పడి లేచే మనసు'.. 'యాత్ర' సినిమాలు అదే డేట్ కు రిలీజ్ అవుతున్నాయి. మరి డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.
అఖిల్ గతంలో నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో 'Mr. మజ్ను' విజయం ఇప్పుడు తన కెరీర్ కు ఎంతో కీలకం. 'తొలిప్రేమ' తో వరుణ్ తేజ్ కి మంచి హిట్ అందించిన వెంకీ అట్లూరి చినబాబుకి కూడా హిట్ ఇస్తాడని అక్కినేని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. జార్జ్ సీ. విలియమ్స్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.