అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హంగామాకు రంగం సిద్ధమైంది. ఇంకొక్క రోజు గ్యాప్ లో థియేటర్లలోకి దిగిపోతోంది అఖిల్ సినిమా. తెలుగులో ఏ అరంగేట్ర హీరోకూ లేని స్థాయిలో భారీగా రిలీజ్ ప్లాన్ చేశారు ఈ సినిమాకు. ప్రపంచవ్యాప్తంగా 1500కు పైగా థియేటర్లలో అఖిల్ విడుదలవుతుందని సమాచారం. హైదరాబాద్ లోని మల్టీప్లెక్సుల్లో అఖిల్ కు భారీగా స్క్రీన్లు కేటాయించారు.
అంతే కాదు.. హైదరాబాద్ ప్రసాద్స్ లోని ఐమాక్స్ బిగ్ స్కీన్ లో అఖిల్ సినిమాకు రోజుకు ఐదు చొప్పున షోలు ఇవ్వడం విశేషం. సాధారణంగా ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో తెలుగు సినిమాలకు రోజుకు ఐదు చొప్పున రెగ్యులర్ గా షోలు ఇవ్వడం అరుదుగా జరుగుతుంటుంది. ఐతే అఖిల్ సినిమా మీద ఉన్న హైప్, అందులోని గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్టుల్ని దృష్టిలో ఉంచుకుని షోలు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా అఖిల్ నిర్మాత నితిన్ మాట్లాడుతూ.. ‘‘భారీ అంచనాల మధ్య 'అఖిల్' చిత్రాన్ని దీపావళి కానుకగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఒక విజువల్ వండర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ పై ప్రతిరోజూ 5 షోలు ప్రదర్శించబోతున్నార. ఇలాంటి విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆడియన్స్ కి చాలా థ్రిల్లింగ్ గా వుంటుంది. యుఎస్ లో మా సినిమాను 168 థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అన్నాడు.