ప్రేమ లీలలు ఒక్కటే అడ్డొస్తాయ్‌

Update: 2015-11-03 17:30 GMT
అక్కినేని అఖిల్ కి.. టాలీవుడ్ బాగానే లైన్ క్లియర్ చేసింది. మాస్ మహరాజా రవితేజ కూడా వెనక్కెళ్లాడు. అసలు ఆ వారం వేరే మూవీ దేన్నీ రిలీజ్ చేసేందుకే ప్లాన్ చేసుకోలేదూ ఎవరూ. ప్రస్తుతం ఉన్న సినిమాలన్నీ.. అఖిల్ వచ్చేనాటికి 3 వారాలు గడిచిపోతాయి. ఈ వారం వస్తున్న స్వాతి త్రిపురకి కాసిని థియేటర్స్ మిగులుతాయంతే. ఇంతగా ఓ లాంఛింగ్ హీరోకి స్పేస్ ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయం. మరోవైపు అఖిల్ పై ఉన్న అంచనాలు కూడా అలాంటివే. అందుకే అఖిల్ కి 2 వారాల పాటు సోలోగా చెలరేగిపోమంటోంది టాలీవుడ్. అయితే.. అఖిల్ కి పోటీ మాత్రం తప్పడం లేదు. ఈ కాంపిటీషన్ ఏకంగా బాలీవుడ్ నుంచి వస్తోంది.

అఖిల్ వచ్చిన మరుసటి రోజే.. సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో రిలీజ్ కానుంది. ఈ మూవీపై బాగానే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్లు నిర్మించిన ప్రేమపావురాలు - ప్రేమాలయం.. తెలుగులో కూడా బ్లాక్ బస్టర్సే. మధ్యలో వచ్చిన ప్రేమానురాగం అంతగా ఆకట్టుకోకపోయినా.. ఇప్పుడదే కాంబినేషన్ లో వస్తున్న ప్రేమలీలపై కూడా బోలెడు అంచనాలున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ సెగ్మెంట్ ని ఈ మూవీ హైజాక్ చేసేసే ఛాన్సులు ఎక్కువ. ప్రస్తుతం భారీగా కలెక్షన్స్ అందించే ఈ విభాగం.. చాలా ముఖ్యం. మరి ఈ ప్రేమలీలను నెగ్గాలంటే.. అఖిల్ అంతకంటే ఎక్కువ లీలలు చూపించాలి.  11న అఖిల్‌ వస్తుంటే.. 12న ప్రేమ లీలలు వస్తున్నాయ్‌.
Tags:    

Similar News