సక్సెస్ లో ఉంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందో లేదోగానీ ఫెయిల్యూర్ లో ఉంటే మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సి వస్తుంది. అందులోనూ వరసగా సినిమాలు నిరశాపరుస్తుంటే హీరోకు టెన్షన్ తప్పదు కదా? అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ తన మొదటి సినిమా విడుదలకు ముందే క్రేజ్ సంపాదించుకున్నాడు.. చాలామందితో స్టార్ మెటీరియల్ అనిపించుకున్నాడు. కానీ అది నిజంకావడం లేదు.
భారీ అంచనాల నడుమ విడుదలైన మొదటి సినిమా 'అఖిల్' తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో నాగార్జున దగ్గరుండిమరీ రీ-లాంచ్ అంటూ 'హలో' ను ప్రమోట్ చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. ముచ్చటగా మూడో సినిమా 'Mr. మజ్ను' ఓ వారం క్రితం విడుదలైంది. ఈ సినిమా కూడా అఖిల్ కు అవసరమైన బ్రేక్ ఇచ్చేలా లేదు. ఇదిలా ఉంటే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు అక్కినేని అభిమానులకు షాక్ ఇచ్చేలా ఉంది. అదేంటంటే అఖిల్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నయట.
అఖిల్ కోసం శ్రీను వైట్ల ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామా కథను రెడీ చేశాడని.. కథ నచ్చడంతో అఖిల్ కూడా ఈ సినిమా చేసేందుకు మొగ్గు చూపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.వెంకీ అట్లూరి తర్వాత అఖిల్ వైట్లకే వోటేశాడని అంటున్నారు. శ్రీను వైట్ల ఒకప్పుడు పెద్ద స్టార్ డైరెక్టరే కానీ ఇప్పుడు మాత్రం వరస డిజాస్టర్లతో ప్రేక్షకుల నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ముఖ్యంగా తన లాస్ట్ సినిమా 'అమర్ అక్బర్ అంటోనీ' లో కూడా తన పంథా మార్చుకోకపోవడంతో శ్రీను వైట్లతో సినిమా అంటేనే హీరోలు ఆమడ దూరం పారిపోతున్నారు. మరి అఖిల్ మనసులో ఏముందో.. నాగ్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.