అఖిల్ నెంబర్ 3 ఇదేనా

Update: 2018-01-05 09:40 GMT
హలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత విజయం సాధించకపోయినా నటన పరంగా అఖిల్ కైతే మంచి మార్కులు పడ్డాయి. మొదటి సినిమాకు దీనికి తనలో చాలా మార్పు కనిపించింది అన్న ఫీడ్ బ్యాక్ పట్ల నాగ్ కూడా హ్యాపీగా ఉన్నాడు. ఇక తాను చేయబోయే మూడో సినిమా గురించి జనవరి 10న ప్రకటిస్తాను అన్న అఖిల్ మాట కోసం ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు.  దీనికి అఖిల్ వద్ద రెండు ఆప్షన్స్ ఉన్నాయట.

మొదటిది సత్య పినిశెట్టి చెప్పిన కథ. ఈ మధ్య తెలుగులో మంచి పాత్రలు దక్కించుకుంటున్న ఆది పినిశెట్టికి ఇతను అన్నయ్య. ప్రసిద్ధ దర్శకుడు రవిరాజా పినిశెట్టికి ఈ ఇద్దరు సంతానం. సత్య గతంలో మలుపు అనే సినిమా తీసి మెప్పు పొందాడు కాని కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు. సత్య చెప్పిన స్టొరీ అఖిల్ కు బాగా నచ్చిందట. గత కొన్ని రోజులుగా సత్యతో అఖిల్ దీని గురించిన డిస్కషన్స్ లో ఉన్నాడట. జనవరి 10న ఇదే ప్రకటిస్తారు అని అంచనాలు ఉన్నాయి.

మరోపక్క కొరటాల శివతో చేసే ప్లాన్ కూడా అఖిల్ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి ఈ కాంబోలో సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్టు వార్త. కాని కొరటాల శివ భరత్ అను నేనులో యమా బిజీగా ఉన్నాడు. మరో మూడు నెలల దాకా ఖాళీ అయ్యే ప్రశ్నే లేదు. అంత దాకా అఖిల్ ను హోల్డ్ లో ఉంచడం కష్టం. నిరంజన్ రెడ్డి రామ్ చరణ్-కొరటాల కాంబో ప్లానింగ్ గతంలోనే చేసారు. కాని అది ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఆలోపు అఖిల్ తో చేస్తే ఎలా ఉంటుంది అని ప్రపోజల్ కూడా ఆయన వద్ద ఉన్నట్టు వార్త. కొరటాల శివ ఇప్పుడు దీని గురించి నిర్ణయం కాదు కదా ఆలోచన చేయటం కూడా కష్టమే. మరి ఈ లెక్కన అఖిల్ సత్యకే ఓకే చెబుతాడా అనే సస్పెన్స్ వీడాలి అంటే జనవరి 10 రావాలి. సత్య చెప్పిన కాన్సెప్ట్ రెగ్యులర్ లవ్ స్టోరీస్ తరహాలో కాకుండా వినూత్నంగా ఉండటం వల్లే పాజిటివ్ గా ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్.
Tags:    

Similar News