అఖిల్‌ ఒక పట్టున కన్విన్స్‌ కావట్లే

Update: 2016-05-11 10:14 GMT
ప్రస్తుతం తన సెకండ్‌ సినిమా ఏదో ఇంకా ఫైనల్‌ చేసుకోవట్లేదు అఖిల్‌. ఆ మధ్యన ఈ సినిమా గురించి కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ.. అఖిల్‌ అండ్ వంశీ పైడిపల్లిని కూర్చోబెట్టి కథను ఫైనల్‌ చేయాలని చెప్పుకొచ్చాడు. అయితే నాగ్‌ ఎంత్ర ప్రయత్నిస్తున్నా కూడా.. చిన్న కొడుకు మాత్రం ఒక పట్టాన కన్విన్స్‌ కావట్లేదని తెలుస్తోంది.

నిజానికి తన తొలిసినిమాతో మాస్‌ స్టార్‌ అవ్వాలని ప్రయత్నించాడు అఖిల్‌. డ్యాన్సుల్లో ఓకె అనిపించుకున్నా.. యాక్టింగ్‌ పరంగా తేలిపోయాడు. తనకు సరిపడని క్యారెక్టర్‌ అనవసరంగా చేశాడని అప్పట్లో నాగ్‌ స్వయంగా కామెంట్‌ చేశారు. అప్పుడు ప్రపంచాన్ని సేవ్‌ చేసే క్యారెక్టర్లు ఎందుకు.. అని సెలవిచ్చారు కూడా. ఇప్పుడు కూడా అదే చెబుతూ.. చక్కగా రొమాంటిక్‌ కథలను వండిస్తున్నారట. కాని అఖిల్‌ మాత్రం వాటికి ససేమిరా అంటున్నాడట. ఇప్పటికే రెండు రొమాంటిక్‌ లవ్‌ స్టోరీలు నెరేట్‌ చేసిన వంశీని.. ఏదైనా మాస్‌ స్టోరీ చేయమని అడుగుతున్నాడట అఖిల్‌.

వాస్తవానికి తొలి సినిమాలతోనే మాస్‌ అని ప్రూవ్‌ చేసుకునే బదులు.. ముందు నిధానంగా రకరకాల జానర్స్‌ చేసుకుంటూ వస్తే.. ఆ తరువాత బాగా సెట్టయ్యాక గా మాస్‌ సినిమాలు చేయొచ్చు. కాని ఒకేసారి మాస్‌ తో మొదలుపెడితే.. ఫ్లాపులయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంది.
Tags:    

Similar News