చైతూపై అఖిల్‌ కామెంట్స్‌.. ఫ్యాన్స్‌ ఫిదా

Update: 2018-09-10 07:49 GMT
అక్కినేని బ్రదర్స్‌ నాగచైతన్య మరియు అఖిల్‌ లు తరుచు ఏదో ఒక కార్యక్రమంలో ఈమద్య కనిపిస్తూనే ఉంటున్నారు. తాజాగా నాగచైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో కూడా అఖిల్‌ పాల్గొన్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ తన మూడవ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ కు బ్రేక్‌ ఇచ్చి మరీ శైలజా రెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వేడుకలో అఖిల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ప్రీ రిలీజ్‌ వేడుకలో అఖిల్‌ మాట్లాడుతూ... నాకు స్టేజ్‌ మీద మాట్లాడాలంటే మాటలు సరిగా రావు. కాని ఈరోజు మాత్రం అన్నయ్య గురించి మాట్లాడేందుకు మాటలు తన్నుకు వస్తున్నాయి. అన్నయ్య ఈమద్యే అల్లుడు అయ్యాడు. అల్లుడు అయ్యాక అన్నయ్య ఫేస్‌ లో గ్లో బాగా పెరిగింది. అన్నయ్యను చూస్తుంటే నాకే ఏమున్నాడ్రా బాబు అనిపిస్తుంది. ఈ సమయంలో అన్నయ్యను మారుతి పట్టుకున్నాడు. కరెక్ట్‌ సమయంలో కరెక్ట్‌ సినిమాను అన్నయ్యతో మారుతి తెరకెక్కించాడు. తప్పకుండా ఇది మంచి విజయాన్ని దక్కించుకుంటుందనే నమ్మకంను అఖిల్‌ వ్యక్తం చేశాడు.

నాగచైతన్య గురించి అఖిల్‌ చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానులకు సంతోషంను కలిగిస్తున్నాయి. ఈ అక్కినేని బ్రదర్స్‌ ఎప్పుడు కూడా ఎలాంటి బేషజాలు లేకుండా ఇలాగే కలిసి మెలిసి ఉండాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న మూడవ సినిమా వేడుకలో కూడా నాగచైతన్య పాల్గొనడం ఖాయం. ఇలా ఒకరి వేడుకలో ఒకరు పాల్గొంటూ అక్కినేని బ్రదర్స్‌ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. అఖిల్‌ 3 మూవీ వచ్చే డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాకు ‘మిస్టర్‌ మజ్ను’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News