తాత పేరు నిల‌బెట్టాలి అఖిల్‌

Update: 2018-09-20 04:48 GMT
అక్కినేని అఖిల్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నప్పుడు ఒక మాట అంద‌రి నోళ్ల‌లో నానేది. అక్కినేని `లెగ‌సీ`ని ముందుకు తీసుకెళ్లేందుకు వార‌సుడొచ్చాడు. నాగార్జున త‌న‌యుడిగా అఖిల్ త‌న భుజ‌స్కంధాల‌పై వేసుకుని ఈ లెగ‌సీని కాపాడతాడా? అంటూ అంద‌రూ ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్న వినేందుకు ఒకే ప్ర‌శ్న‌. కానీ వెయ్యి శూలాల్ని గుండెల్లో దించే ప్ర‌శ్న కూడా. ఎందుకంటే వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ ఇప్పుడున్న ప‌రిశ్ర‌మ‌లో నెగ్గుకు రావాలంటే అంత సులువేం కాదు. తాత‌ - డాడ్ కేవ‌లం ఎంట్రీ లెవ‌ల్ వ‌ర‌కే. ఆ త‌ర్వాత ఇక్క‌డ ఎవ‌రికి వారే ఎద‌గాలి. అందుకు అక్కినేని క్యాంప్‌ లోనే కొంద‌రు హీరోలు ఎగ్జాంపుల్‌ గా నిలిచారు.

హీరోగా ఎద‌గాలంటే .. ముందు జ‌నం మెచ్చాలి. వాళ్లే సిస‌లైన వార‌సుడొచ్చాడు అని కితాబివ్వాలి. అప్పుడు మాత్ర‌మే లెగ‌సీని ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ద‌క్కుతుంది. అయితే అలాంటి మెప్పు ద‌క్కాలంటే దానికి ఎంత‌గానో శ్ర‌మించాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. శ్ర‌మ‌కు టెక్నిక్‌ - అదృష్టం క‌లిసి రావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పోటీలో బ్రెయిన్ విత్ హీరోయిజం మాత్ర‌మే వ‌ర్క‌వుట‌వుతుంద‌ని నాని - దేవ‌ర‌కొండ లాంటి న‌ట‌వార‌స‌త్వం లేని వాళ్లు నిరూపించారు. ఇప్పుడు అఖిల్ కూడా అలానే దూసుకెళ్లాల్సి ఉంటుంది. తొలి రెండు సినిమాల వ‌ర‌కూ డాడ్ కాపు కాసారు స‌రే.. ఈసారి మాత్రం అఖిల్ సిస‌లైన చియాన్‌ లా ఆలోచించి దూసుకెళ్లాల్సి ఉంటుంది.

నేడు తాతగారు - లెజెండ్ ఏఎన్నార్ జ‌యంతి సంద‌ర్భంగా అఖిల్ ఎంతో ఉద్వేగంగానే స్పందించాడు. ``హ్యాపి బ‌ర్త్ డే తాతా. అక్కినేని అన్న పేరును ప్ర‌తిరోజు త‌ల‌చుకుంటాను. ఆ ఘ‌న‌త‌ను మాకు ఇచ్చావు. అందుకే ఆ పేరు నిల‌బెట్టేలా గ‌ర్వంగా నిలిచేలా నేను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తాను. అంత గొప్ప ఖ్యాతిని ఇచ్చిన మీకు నా కృత‌జ్ఞ‌త‌లు. ల‌వ్ యు ఫ‌ర్ ఎవ్వ‌ర్‌. నిన్ను మిస్స‌వుతున్నాం. ఏఎన్నార్ లివ్స్ ఆన్‌`` అని ట్విట్ట‌ర్‌ లో స్పందించారు. `మ‌నం` సెట్స్‌ లో అక్కినేని జ్ఞాప‌కాలు అఖిల్‌ ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయ‌ని ఈ ట్వీట్ చెబుతోంది. అఖిల్‌ని మాత్ర‌మే కాదు - అక్కినేని అభిమానులంద‌రినీ ఆ జ్ఞాప‌కాలు వెంటాడుతూనే ఉంటాయి.
Tags:    

Similar News