ఊపిరి మూవీ వెండితెర పైకి వచ్చేసింది. ఎంతో విభిన్నమైన కేరక్టర్ లో తండ్రి నాగార్జున చేసేందుకు తాము ముందు ఒప్పుకోలేదని.. అఖిల్ గతంలోనే స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మూవీ విడుదలయ్యాక ఆడియన్స్ మధ్యలో సినిమా చూసి, ఎంతో గొప్పగా ఫీలవుతున్నానని అంటున్నాడు. అదే విషయాన్ని, సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు అక్కినేని అఖిల్.
" మా నాన్న మళ్లీ సాధించారు. ఆ అద్భుతమైన చిత్రాన్ని, అనుభవాన్ని తిరికి క్రియేట్ చేసినందుకు మొత్తం ఊపిరి టీం అంతటికీ కంగ్రాట్స్. ఖచ్చితంగా స్వచ్ఛమైన శ్వాసను అందించడం లాంటిదే ఊపిరి" అని ట్వీట్ చేశాడు అఖిల్. తండ్రి నటనకు అద్భుతం అని, ఆ కేరక్టర్ కు నాగార్జున ఊపిరి పోశారని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఫ్రెంచ్ మూవీని పర్ఫెక్ట్ గా ఇండియనైజ్ చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లిని కూడా పొగడ్తల్లో ముంచెత్తాడు.
"ఊపిరి కోసం వంశీ పైడిపల్లి చాలా కష్టపడ్డాడు. ఒరిజినల్ లోని ఫీల్ ఏ మాత్రం మిస్ కాకుండా.. తిరిగి అద్భుతాన్ని చేయగలిగాడు. వినోద్ సార్ ఆయన బెస్ట్ ఇచ్చేశారు. ఇలాంటి డేరింగ్ ప్రాజెక్ట్ ని ఎంతో నమ్మకంగా చేసినందుకు ప్రొడ్యూసర్ పీవీపీకి అయితే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అన్నాడు అఖిల్. కార్తీ, తమన్నాల యాక్టింగ్ స్కిల్స్ ని పొగడ్డానికి మాటలు చాలడం లేదని కూడా చెప్పాడు. అఖిల్ డిజాస్టర్ తర్వాత ఈ అక్కినేని హీరో చేయబోతున్న రెండో సినిమా వంశీ పైడిపల్లితోనే కావడం గమనించాలి.