మొన్నటివరకు రోజుకో డైరక్టర్ పేరు వినిపించింది. ఆ మధ్యన వంశీ పైడిపల్లితో తన తదుపరి సినిమా చేస్తున్నట్లు అక్కినేని అఖిల్ స్వయంగా చెప్పాడు. ఆ తరువాత హను రాఘవపూడితో సినిమా అంటూ మరోసారి అఖిలే చెప్పాడు. దాని తరువాత విక్రమ్ కుమార్ తో సినిమా అన్నారు. తరువాత మారుతి పేరు కూడా వినిపించింది. కాని ఒక్కటి కూడా ఫైనల్ కాలేదు. 'అఖిల్' సినిమా ఘోర పరాజయం సాధించాక.. రెండో సినిమా ఎంచుకోవడానికి ఏకంగా ఏడాది టైమ్ పట్టేస్తుందని అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు.
అయితే ఇప్పుడు అఖిల్ చేయబోయే సినిమాపై ఒక క్లారిటీ వచ్చేసింది. స్వయంగా కింగ్ నాగార్జున ఒక అఫీషియల్ ప్రకటన చేశారు. ''సెప్టెంబర్ అదిరిపోబోతోంది. నా ఇద్దరి స్టార్ డైరక్టర్లతో రెండు కొత్త సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాను. కళ్యాణ్ కృష్ణ డైరక్షన్లో నాగచైతన్య సినిమా.. విక్రమ్ కుమార్ డైరక్షన్లో అఖిల్ సినిమా.. ఫ్లోర్ మీదకు వెళ్లడమే తరువాయి'' అంటూ ప్రకటించి నాగ్. ఈ దెబ్బతో ఇప్పటివరకు లేని క్లారిటీ నీట్ అండ్ హాట్ గా వచ్చేసినట్లయ్యింది. స్వయంగా నాగ్ ప్రకటించేశారు కాబట్టి.. వీటిని అఖిల్ ట్వీట్లలా అనుకోలేం. కన్ఫామ్ గా సినిమాలు కన్ఫామ్ అంతే.