పవన్ ఆద్వర్యంలోనే అకీరా అన్నీ..!

Update: 2021-08-04 13:58 GMT
పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా సంగీతం.. డాన్స్‌ లతో పాటు మార్షల్‌ ఆర్ట్స్ ను కూడా నేర్చుకుంటున్నాడు. ఇవన్ని కూడా స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ దగ్గరుండి తన ఇంటి వద్ద వ్యక్తిగత గురువులను ఏర్పాటు చేసి మరీ నేర్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ కొన్ని కారణాల వల్ల రేణు దేశాయ్ తో విడిపోయినా కూడా పిల్లల విషయంలో మాత్రం ఎప్పుడు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు అనేది టాక్. ఇద్దరు పిల్లలకు తండ్రిగా అన్ని విధాలుగా వారికి ప్రోత్సాహకంగా నిలుస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు కొడుకు అకీరాకు మార్షల్‌ ఆర్ట్స్ లో ట్రైనింగ్‌ ఇప్పిస్తున్నాడు.

పవన్‌ కళ్యాణ్‌ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందు మార్షల్‌ ఆర్ట్స్‌ లో ట్రైనింగ్‌ అయ్యాడు. అందుకే ఇప్పుడు కొడుకు కు కూడా మార్షల్‌ ఆర్ట్స్‌ ను నేర్పించాలని భావిస్తున్నాడు. అకీరా హీరోగా వస్తాడా లేదా అనేది ఇప్పుడు ఏం చెప్పలేం. అసలు హీరోగా పరిచయం అవ్వకున్నా కూడా కొందరు మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఫిజిక్ విషయంలో అకీరా ది బెస్ట్‌ అన్నట్లుగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అకీరా నందన్‌ ను హీరోగా పరిచయం చేసే ఉద్దేశ్యం లేదు.. అతడికి వయసు కూడా లేదు. మొత్తానికి అకీరా నందన్‌ మార్షల్‌ ఆర్ట్స్  విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అకీరాకు అన్ని కూడా స్వయంగా పవన్‌ దగ్గర ఉండి మరీ నేర్పిస్తున్నాడు. తాను నటుడిగా ఎంత బిజీగా ఉన్నా కూడా.. రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా పిల్లల విషయంలో ఆయన తీసుకుంటున్న శ్రద్దను అభినందించాల్సిందే అంటున్నారు. ఇక పవన్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రానాతో కలిసి ఒక సినిమాను చేస్తున్నాడు. అది త్వరలోనే పూర్తి కాబోతుంది. ఆ వెంటనే క్రిష్‌ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటించబోతున్నాడు. ఇంకా కొన్ని సినిమాలు కూడా ఈయన నటిస్తున్నాడు.
Tags:    

Similar News