టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కాస్త స్లో అయితే అయ్యి ఉండవచ్చు కాని మంచి సినిమాలు చేయడంతో పాటు మంచి పాత్రలు చేస్తుందని ప్రశంసలు పొందుతోంది. సమంత ప్రస్తుతం చేస్తున్న ప్రతి సినిమా కూడా ఆమె నటన ప్రతిభను కనబర్చేవిగా ఉంటున్నాయి. కమర్షియల్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న సమంత ప్రస్తుతం జాను వంటి కాన్సెప్ట్ బేస్డ్.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ తన ఇమేజ్ ను మరింతగా పెంచుకుంటుంది.
అయితే ఇదంతా కూడా చైతూ వల్లే అంటూ భర్తపై ప్రశంసలు కురిపించింది. తాజాగా హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019 గా సమంత అక్కినేని ఎంపిక అయ్యింది. ఆ సందర్బంగా సమంత ఇంటర్వ్యూలో నాగచైతన్య గురించి.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. మీరు కంటిన్యూ అవ్వడంపై మీ భర్త చైతన్య స్పందన ఏంటీ..? పెళ్లి తర్వాత మీ సినీ జీవితం ఎలా సాగుతుందని ప్రశ్నించిన సందర్బంగా సమంత ఆశ్చర్యకర సమాధానం చెప్పింది.
పెళ్లి అయిన వెంటనే సినిమాలకు గుడ్ బై చెప్పాలని నేను అనుకున్నాను. అదే విషయాన్ని చైతూ తో అన్న సమయంలో అతడు నన్ను మందలించాడు. నీకేమైనా పిచెక్కిందా. నీవు నిజంగా సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నావా అంటూ ఆశ్చర్య పోతూ అడిగాడు. పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి కారణం చైతూ అని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత ఎవరైనా బ్రేక్ తీసుకుంటే వారు మళ్లీ కమ్ బ్యాక్ అయిన సందర్బాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే పెళ్లి తర్వాత బ్రేక్ తీసుకోకుండా అలాగే సినిమాలు చేయడానికి ప్రధాన కారణం చైతూ అంటూ సమంత చెప్పుకొచ్చింది.
ఇక నేను నా భర్త చైతూ పక్కన ఉన్న సమయంలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా.. మోస్ట్ సెక్సియెస్ట్ ఉమెన్ గా కనిపిస్తానంది. తనకు తానుగా కంటే చైతూ పక్కన ఉన్నప్పుడే ఎక్కువగా ఇష్టపడతాను అంది. మొత్తానికి చైతూపై తనకున్న ప్రేమను ఈ మాటలతో సమంత వెళ్లడి చేయడం అక్కినేని ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.