అక్కినేని ఫ్యామిలీ ఈజ్ బ్యాక్...!

Update: 2018-10-06 16:29 GMT
అక్కినేని ఫ్యామిలీ అంతా ఇబిజా టూర్ లో ఎంజాయ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న అక్కినేని ఫ్యామిలీ...త‌మ‌కు దొరికిన కొద్ది గ్యాప్ ను వెకేష‌న్ లో ఎంజాయ్ చేశారు. ఆ టూర్ లో నాగ్ - స‌మంత‌లు షేర్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా, ఆ టూర్ ముగించుకున్న‌ అక్కినేని కుటుంబం ఇండియాకు చేరుకుంది. ఈ విష‌యాన్ని నాగ్  - సామ్ లు ట్వీట్ చేశారు. ఓ డ్రీమ్ హాలిడే నుంచి రొటీన్ లైఫ్ కు తిరిగి వ‌చ్చామ‌ని నాగ్ ట్వీట్ చేశాడు. ఈ రోజు తమ ఫ‌స్ట్ మ్యారేజ్ యానివ‌ర్స‌రీ జ‌రుపుకుంటున్న విష‌యాన్ని సామ్ ట్వీట్ చేసింది. నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని - చై పక్కనుంటే తనకు ఎంతో ధైర్యంగా ఉంటుందని చెప్పింది.

త‌న‌లోని బెస్ట్ పార్ట్ అయిన చైకు వివాహ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అని సామ్ ట్వీట్ చేసింది. ప్ర‌తిరోజు త‌న షూటింగ్ ముగించుకున్న త‌ర్వాత చై ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం త‌న జీవితంలో గొప్ప విష‌య‌మ‌ని చెప్పింది. త‌మ‌కు వివాహ దినోత్సవ శుభాకాంక్ష‌లు చెప్పిన వారంద‌రికీ సామ్ ధ‌న్య‌వాదాలు చెప్పింది. గ‌త ఏడాది అక్టోబ‌రు 6న నాగ చైత‌న్య‌ - స‌మంత‌లు ఒక్క‌టైన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు, ఈ రియ‌ల్ లైఫ్ క‌పుల్ ...రీల్ లైఫ్ లో కూడా క‌పుల్ గా మ‌రోసారి న‌టించ‌బోతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో చై, సామ్ జంట‌గా రూపొందుతోన్న 'మజిలీ' చిత్రం షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. వచ్చేవారం నుంచి ఈ సినిమా షూటింగులో సమంత .. చైతూ పాల్గొనబోతున్నారు. పెళ్లి తరువాత సమంత .. చైతూ కలిసి నటిస్తోన్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. హిందీ నటి దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో  న‌టించ‌బోతోంది.


Tags:    

Similar News