83 స‌మ‌ర్ప‌కుడిగా కింగ్ నాగార్జున‌

Update: 2020-01-23 14:35 GMT
స్పోర్ట్స్ బ‌యోపిక్ ల‌కు ఉన్న క్రేజు గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఇప్ప‌టికే ఎన్నో క్రీడా బ‌యోపిక్ లు రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించాయి. అదే కేట‌గిరీలో రాబోతున్న మ‌రో సినిమా 83. క్రికెట్ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే సినిమా ఇద‌ని చెబుతున్నారు. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీలో టీమిండియా కెప్టెన్ క‌పిల్ దేవ్ పాత్రను.. టీమిండియా ఆట‌గాళ్ల ప‌నిత‌నాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ర‌ణ‌వీర్ సింగ్   క‌పిల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా అత‌డి భార్య పాత్ర‌లో రియ‌ల్ వైఫ్‌ దీపిక ప‌దుకొనే న‌టిస్తోంది. కబీర్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నిర్మాతలు విష్ణువర్ధన్ ఇందూరి- మధు మంతెన సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2020 ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్ప‌టికే 83 ఫ‌స్ట్ లుక్ స‌హా టీజ‌ర్ రిలీజై ఆక‌ట్టుకున్నాయి. ర‌ణ‌వీర్ త‌న పాత్ర‌లోకి ఒదిగిపోయి న‌టిస్తున్నాడ‌ని అత‌డి గెట‌ప్ ఇన్వాల్వ్ మెంట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకి దీపిక ప‌దుకొనే ఒక నిర్మాత‌గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా తెలుగు వెర్ష‌న్ ని రిలీజ్ చేసేందుకు కింగ్ నాగార్జున ఒప్పందం కుదుర్చుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. నాగార్జున స‌మ‌ర్ప‌ణ‌లో తెలుగులో తన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఆ విషయాన్ని నాగ్ స్వయంగా ప్రకటించారు. అలాగే ఈ చిత్రాన్ని త‌మిళంలో ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ రిలీజ్ చేస్తున్నారు.

ఇక క్రికెట్ ప్రేమికుడిగా .. స్పోర్ట్స్ అభిమానిగా నాగార్జున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తెలుగు నాట కింగ్ ప్ర‌మోష‌న్ 83కి పెద్ద అస్సెట్ కానుంది. నాగార్జున వార‌సుడు అఖిల్ గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇంట‌ర్వ్యూల్లో టీమిండియా పెర్ఫామెన్స్ గురించి నాగార్జున మీడియాతో ప్ర‌స్థావిస్తుంటారు. ఆయ‌న ఆస‌క్తికి త‌గ్గ‌ట్టే 83ని తెలుగైజ్ చేసి రిలీజ్ చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక బాలీవుడ్ యువ‌క‌థానాయ‌కుడు ర‌ణ‌బీర్ తో క‌లిసి నాగార్జున నటించిన బాలీవుడ్ చిత్రం `బ్రహ్మాస్త్ర` త్వ‌ర‌లో విడుదల కానుంది. ఎం.ఎస్.ధోని- యాన్ అన్ టోల్డ్ స్టోరి- భాగ్ మిల్కా భాగ్- మేరీకోమ్ త‌ర‌హాలో ఈ సినిమా విజ‌యం సాధిస్తుందా? అన్న‌ది చూడాలి.


Tags:    

Similar News