తాప్సీ..వాణీ క‌పూర్ మ‌ధ్య‌లో ఖిలాడీ డ‌బుల్ డోస్!

Update: 2022-11-24 03:30 GMT
బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ బిజీ షెడ్యూల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఏడాదంతా సినిమా షూటింగ్ ల‌తో బిజీగానే ఉంటారు. బాలీవుడ్ లో  ఏ స్టార్ హీరో కూడా క్షిలాడీ అంత వేగంగా సినిమాలు చేయ‌లేరు. ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాలేరు. ఇది కేవ‌లం అక్ష‌య్ కి  మాత్ర‌మే చెల్లింది. ఓవైపు ఆన్ సెట్స్ లో ఉంటూనే కొత్త సినిమాల‌కి సైన్ చేసి తెర‌పైకి తెస్తుంటారు.

కోవిడ్ స‌మ‌యంలో హీరోలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మైతే అక్ష‌య్ మాత్రం షూటింగ్ లో పాల్గొన్నారు.  త‌న సినిమాల్ని థియేట‌ర్..ఓటీటీ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. అలాగే ఇత‌ర భాష‌ల్లో వ‌చ్చిన అవ‌కాశాల్ని సైతం స‌ద్వినియోగం చేసుకుంటారు. భాషా బేధం లేకుండా సినిమాలు చేయ‌డం కూడా ఆయ‌న‌కే చెల్లింది. అక్ష‌య్ లో ఆ పాజిటివ్ యాంగిల్ అంద‌రికీ న‌చ్చేదిగా చెబుతుటారు.

తాజాగా  ఈ హీరో మ‌రో కొత్త సినిమా కి క‌మిట్ అయ్యాడు. ఈసారి ఏకంగా ఇద్ద‌రి భామ‌ల‌తో ఘాటైన రొమాన్స్ పండించ‌బోతున్నారు.  'ప‌తి ప‌త్నీ ఔర్'  చిత్రంతో విజ‌యం అందుకున్న ముద‌స్స‌ర్ అజీజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమాచేయ‌డానికి రెడీ అయ్యారు.

ఇందులో వాణీక‌పూర్....తాప్సీ ల‌ను హీరోయిన్ల‌గా తీసుకున్నారు.  ఆ ఇద్దరి మ‌ధ్య‌లో కిలాడీ న‌లిగి పోనున్నారు.

రొమాంటిక్ కామెడీ  ఎంటర్ టైన‌ర్ గా మ‌లుస్తున్నారు. ఈ సినిమాకి ముందుగా హీరోయిన్ల‌నే ఎంప‌కి చేసారు. ఆ త‌ర్వాత  హీరో ఎవ‌రైతే బాగుంటుంది అన్నాలోచ‌న నుంచి అక్ష‌య్ పేరు వ‌చ్చిందిట‌. మ‌రి నారీ నారీ న‌డుమ మురారీ మ‌ధ్య అక్ష‌య్  ఎలా మెప్పిస్తాడో చూడాలి.  ఈసినిమా కి 'డ‌బుల్ ఎక్స్ ఎల్'...'ఖేల్ ఖేల్..మే' అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.

స్ర్కిప్ట్ స‌హా అన్ని ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్ష‌య్ కుమార్ చేతిలో ఆరేడు సినిమాలున్నాయి. 'సెల్ఫీ'..'యాన్ యాక్ష‌న్ హీరో'..'ఓమై గాడ్ -2'..'క్యాప్సుల్  గుల్'..'స‌రూరై పొట్రు' రీమేక్ల ఓ లో న‌టిస్తున్నారు. ఇవ‌న్నీ2023లోనే  ప్రేక్ష‌కుల ముంద‌కు రానున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News