బాలీవుడ్ హీరోల్లో మినిమం గ్యారెంటీ అన్నట్లుగా వరుస పెట్టి సినిమాలు చేసే అగ్రహీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. అతడి సినిమా అంటే చాలు.. కనీసం రూ.వంద కోట్ల కలెక్షన్ ఖాయమన్న ధీమాతో నిర్మాతలు ఉంటారు. అలాంటి హీరో తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆయన చేస్తున్న సినిమాల్లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిం ప్రొడక్షన్ నిర్మిస్తున్న ‘‘పృథ్వీరాజ్’’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా సంగతే ఏమో కానీ.. ఆందోళనకారుల నిరసనకు అక్షయ్ ఇబ్బంది పడుతున్నారు.
తాజాగా ఈ సినిమా పేరు మార్చాలన్న నిరసన చేపడుతూ.. అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను నిరసనకారులు కాల్చారు. అంతేకాదు.. సినిమా పేరును మార్చకుంటే మరిన్ని ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సినిమా పేరు కేవలం పృథ్వీరాజ్ అని మాత్రమే ఉండకూడదని.. పూర్తి పేరు ‘‘హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’’ అని కానీ ‘‘చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్’’ అని కానీ ఉండాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే.. పృథ్వీరాజ్ చివరి హిందూ చక్రవర్తి అని.. అలాంటప్పుడు ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలన్నది క్షత్రియ.. రాజ్ పుత్ సమాజ ప్రతినిధుల వాదన.
అంతేకాదు.. ఈ సినిమా విడుదలకు ముందే.. ఈ వర్గాల ప్రముఖులకు సినిమా వేయాలని.. ఏమైనా అభ్యంతరకర అంశాలు ఉంటే తొలగించేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సినిమా పేరును మార్చాలని.. ఆ విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తే.. గతంలో పద్మావతి.. జోధా అక్బర్ చిత్రాలకు పట్టిన గతే పడుతుందని నిర్మాత.. దర్శకుడికి వార్నింగ్ ఇచ్చారు. అయితే.. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను తగలబెట్టటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరీ.. వివాదంపై దర్శక నిర్మాతలు ఏ విధంగా రియాక్టు అవుతారో చూడాలి.