తెలుగు సినిమా బిజినెస్ మల్టిపుల్ లెవెల్లో డెవలప్ అవ్వడానికి కారణం.. మన సినిమాలను తమిళం - మలయాళం - హిందీలలో క్యాష్ చేసుకోవడమే. ఇక హిందీ సినిమాలను కూడా అడపాదడపా డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేస్తే.. ఓ రెండు కోట్లు వచ్చేస్తోంది. దానితో హిందీవాళ్ళు మొన్నటివరకు తమ సినిమాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉండేవారు.
ఈ మధ్యన హిందీ సినిమాలను తెలుగులోకి డబ్ చేసినా చేయకపోయినా హైదరాబాద్ వచ్చి ప్రమోట్ చేయాలని ఒక రూల్ పెట్టుకున్నారు. షారూఖ్ ఖాన్‌వంటి హీరోలు రెగ్యులర్ గా ఇక్కడ ప్రమోషన్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ వంతొచ్చింది. మనోడి ''రుస్తుం'' సినిమా త్వరలోనే రిలీజవుతున్న తరుణంలో.. ఇప్పుడు అక్షయ్ ఏకంగా తెలుగు బుల్లితెరను కూడా వాడుకోవాలని చూస్తున్నాడు. అసలే త్వరలో రోబో 2.0 సినిమాలో విలన్ గా కూడా మెరవనున్నాడు కాబట్టి.. ఖచ్చితంగా ఇక్కడ ప్రమోషన్ అవసరమే. అందుకే ఇప్పుడు యాంకర్ ప్రదీప్ చేసే 'కొంచెం టచ్ లో ఉంటే చెబ్తాను' షో లో మనోడు ఎంట్రీ ఇస్తున్నాడు.
అంతేలేండి.. మన రాజమౌళి అండ్ బాహుబలి గ్యాంగ్ వెళ్ళి అక్కడి ప్రముఖ కార్యక్రమాల్లో పాల్గొనలేదా.. ఇప్పుడు బాలీవుడ్ కూడా అదే స్ర్టాటజీ మనపైన వాడుతోంది అనమాట. అయితే ఈసారి ఇటువంటి తెలుగు షోల్లోకి షారూఖ్ ఖాన్ వంటి స్టార్ వచ్చేసినా వచ్చేయొచ్చు.