‘2.0’ సినిమాలో అక్షయ్ కుమార్‌ది విలన్ పాత్ర అనే మొదట్నుంచి అంతా అనుకుంటున్నారు. ఈ పాత్ర లుక్ చూసినా కూడా అదే ఫీలింగ్ కలుగుతుంది అందరికీ. కానీ ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ కాదంటూ చిత్ర వర్గాల నుంచి సమాచారం బయటికి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాలో అక్షయ్ పోషించే డాక్టర్ రిచర్డ్ పాత్ర ఒక మంచి కాజ్ కోసమే పని చేస్తుందట.
‘‘అక్షయ్ ‘2.0’లో విలన్ కాదు. అక్షయ్ కాస్ట్యూమ్స్.. ప్రోస్థెటిక్ మేకప్ చూస్తే అతనో ఫెరోషియస్ క్యారెకక్టర్ చేస్తున్న విషయం అర్థమవుతుంది. అది వాస్తవమే. కానీ డాక్టర్ రిచర్డ్ గా అక్షయ్ పాత్ర మంచి కాజ్ కోసమే పని చేస్తుంది. భూమిని నాశనం చేయడానికి ప్రయత్నించే శక్తులతో అతను పోరాడతాడు. అతను ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించడు. కానీ ఆ పాత్రలో ఓ ప్రత్యేకత ఉంటుంది’’ అని ‘2.0’ టీంలోని ఓ వ్యక్తి చెప్పారు.
అక్షయ్ చేసిన పాత్రకు ముందు కమల్ హాసన్‌ను.. ఆ తర్వాత ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ను అనుకున్నాడు శంకర్. చివరికి అక్షయ్ దగ్గర ఆ పాత్ర ఆగింది. అక్షయ్ దక్షిణాది వాళ్లకు కొత్త కాబట్టి నెగెటివ్ రోల్ చేసినా ఓకే.. కానీ అతడు ఉత్తరాదిన పెద్ద స్టార్. కాబట్టి పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ లో అక్షయ్ ను చూపించాలని శంకర్ భావించలేదట. అందుకే ఆ పాత్రకు పాజిటివ్ టచ్ కూడా ఇచ్చాడట. మరి రజినీ అక్షయ్ తో తలపడినపుడు.. మళ్లీ ‘రోబో’లో మాదిరే రోబోతో ఫైట్ చేస్తాడా?