బాలీవుడ్ సినిమాలు గతంలో ఎప్పుడూ లేనంతగా ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొంటున్నాయి. కరోనా మొదలైంది మొదలుకుని ఇప్పటి వరకు బాలీవుడ్ లో సాలిడ్ ఇండస్ట్రీ హిట్ పడిందే లేదు. రెండున్నర ఏళ్లలో బాలీవుడ్ నుండి వచ్చిన హిట్ సినిమాలు ఏంటీ అన్నా కూడా ఠక్కున చెప్పలేని పరిస్థితి. థియేటర్ రిలీజ్ అయిన దాదాపు 99 శాతం సినిమాలు డిజాస్టర్ గానే నిలుస్తున్నాయి.
కరోనా ముందు మినిమం వంద కోట్లు గ్యారెంటీ అంటూ పేరు దక్కించుకున్న అక్షయ్ కుమార్ కూడా ఇప్పుడు గడ్డు కాలం ను ఎదుర్కొంటున్నాడు. ఈ సంక్షోభ కాలం లో ఆయన నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఒకప్పుడు వంద కోట్లు మినిమంగా సాధించిన అక్షయ్ కుమార్ ఇప్పుడు పాతిక కోట్లు రాబట్టడమే గగనం గా మారింది.
ఇటీవల ఆయన నుండి వచ్చిన సినిమా లు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఆయన నటించిన 'రాక్షసన్' రీమేక్ కట్ పుట్లి థియేట్రికల్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ సినిమా యొక్క ట్రైలర్ విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన అక్షయ్ కుమార్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కట్ పుట్లి ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... ప్రేక్షకులు థియేటర్ లకు రావడం లేదు అంటే సినిమా బాగాలేదని అర్థం. తాము చేసిన సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదు. సినిమా నచ్చే విధంగా తీస్తే తప్పకుండా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతారు. తన సినిమాలు ఆడక పోవడం కు కారణం తానే అన్నాడు.
ఒక సినిమా పట్టాలెక్కడానికి కారణం నేను అయినప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయితే అది నాదే తప్పు అవుతుంది. ఈ విషయంలో ప్రేక్షకులను నిందించడం.. మరొకరిని నిందించడం సరి కాదని అన్నాడు. తాను సినిమాల యొక్క ఫ్లాప్ కు పూర్తి బాధ్యత వహిస్తాను అంటూ నిజాయితీగా తన సినిమాల యొక్క ఫ్లాప్ లకు సంబంధించిన విషయం ను ఒప్పుకున్నాడు.
సినిమా థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే విధంగా సినిమా మేకింగ్ లో మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకుల మారిన అభిరుచికి తగ్గట్లుగా సినిమా లను చేయాలి. వారికి నచ్చే విధంగా సినిమాలు తీయడం ద్వారా మళ్లీ పూర్వ వైభవంను సొంతం చేసుకోవచ్చు అన్నట్లుగా అక్షయ్ మాట్లాడాడు.
ఇప్పుడు బాలీవుడ్ లో అందరి మాట అదే.. కానీ ఏ ఒక్కరు కూడా అక్కడి ప్రేక్షకుల అభిరుచిని పట్టుకోలేక పోతున్నారు. ముందు ముందు రాబోతున్న సినిమాలన్నీ హిందీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం లో సఫలం అవుతాయో లేదో చూడాలి.