సూపర్ స్టార్ అనిపించుకున్నాడు..

Update: 2020-05-26 05:30 GMT
తెలంగాణలో అన్నింటికి అనుమతించిన సర్కార్ సినిమా షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్స్ కు అనుమతి ఇవ్వకపోవడంతో తెలుగు సినీ పెద్దలు, నిర్మాతలు స్వయంగా కేసీఆర్ ను కలిసి అనుమతులు తెచ్చుకున్నారు. అయితే ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జున తప్పితే మిగతా స్టార్ హీరోలు ఎవరూ ముందుకు రాలేదు. దీనిపై విమర్శలు వచ్చాయి. మహేష్, ఎన్టీఆర్, పవన్, ప్రభాస్, బాలయ్య, వెంకటేశ్ లాంటి  స్టార్ హీరోలకు  పట్టదా.? సినిమా ఇండస్ట్రీ బాగు కోసం కార్మికుల కోసం  వారు బయటకు రారా అన్న విమర్శలు మొదలయ్యాయి.

మన సంగతి ఇలా ఉంటే.. బాలీవుడ్ లో మాత్రం కరోనాతో అట్టుడికిపోతున్న మహారాష్ట్రలో షూటింగ్ చేసి నిజంగానే ఈ బాలీవుడ్ హీరో సూపర్ స్టార్ అనిపించుకున్నారు. అంతటి మహమ్మారి విస్తరిస్తున్న వేళ బయటకొచ్చాడు. ఏకంగా ప్రభుత్వం కోసం.. ప్రజల కోసం షూటింగ్ లో పాల్గొని అందరి మనసులు గెలుచుకున్నాడు.

ప్రస్తుతం లాక్డౌన్ ఎఫెక్ట్ తో మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా షూటింగ్ లన్నీ క్యాన్సిల్ అయ్యాయి. అనుమతులు ఇవ్వడం లేదు. అయితే రెండు నెలల తర్వాత ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి ఇటీవలే అనుమతిచ్చింది. అయితే షూటింగ్స్ కు ఇంకా అనుమతిని మహారాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు.

అయితే తాజాగా అక్షయ్ కుమార్ షూటింగ్ లో పాల్గొన్నారు. పరిమిత సంఖ్యలోని యూనిట్ సభ్యులతో అక్షయ్ పై కొన్ని సీన్లను తీశారు. ఓ ప్రభుత్వ ప్రకటన కోసం ఇదంతా తీశారు. లాక్ డౌన్ తర్వాత అనుసరించాల్సిన విధి విధానాలపై ఈ చిత్రీకరణ చేశారు. పోలీసు అనుమతి తీసుకొని ఈ షూటింగ్ చేశారు. అక్షయ్ ఇంతటి క్లిష్ట విపత్కర పరిస్థితుల్లోనూ షూటింగ్ కు హాజరై అందరూ హీరోలకంటే శభాష్ అనిపించుకున్నారు. నిజమైన సూపర్ స్టార్ అంటూ అక్షయ్ ను కొనియాడుతున్నారు.
Tags:    

Similar News