కాటమరాయుడుగా ఖిలాడీ??

Update: 2017-09-01 11:25 GMT

బాలీవుడ్ ఖిలాడీ ఎవరు అంటే.. టక్కుమని వినిపించే పేరు అక్షయ్ కుమార్. ప్రస్తుతం ఖాన్ త్రయంలో ఆమిర్ మినహా మిగతా హీరోలు ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నా.. అక్షయ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర దున్నేస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతున్న అక్షయ్ కుమార్.. ఇప్పుడు ఓ సౌత్ రీమేక్ లో నటించనున్నాడు.

పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ కాటమరాయుడు. పవన్ కళ్యాణ్ కనిపించిన గ్రామస్తుడి పాత్రలో.. నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా ఇప్పుడు అక్షయ్ కుమార్ నటించనున్నాడట. అయితే.. పవర్ స్టార్ నటించిన మూవీ రీమేక్ అనే సంగతి తెలిసిందే. అజిత్ నటించిన తమిళ్ మూవీ వీరమ్ కు రీమేక్ గా తెలుగులో కాటమరాయుడు రూపొందింది. ఇప్పుడీ వీరమ్ ను హిందీలోకి రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడట అక్షయ్ కుమార్. గతంలో వరుసగా సౌత్ రీమేక్ లలో నటించి అలరించిన అక్షయ్ కుమార్.. బాస్ తర్వాత మరే రీమేక్ లోనూ కనిపించలేదు.

అయితే.. వీరమ్ స్టోరీ లైన్ విపరీతంగా నచ్చేయడంతో.. దీని రీమేక్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మూవీలో అక్షయ్ కుమార్ కూడా లుంగీ లుక్ లోనే కనిపించనున్నాడని అంటున్నారు. సౌత్ స్పెషల్ అయిన లుంగీ లుక్ హీరోతో బాలీవుడ్ మూవీ అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే!
Tags:    

Similar News