ఇండియన్ 2 కి శంకర్ పక్కా ప్లాన్

Update: 2018-11-22 07:37 GMT
ప్రేక్షకులంతా 2.0 చూడడానికి కళ్ళు కాయలు కాచేలా 29 తేదీ కోసం ఎదురు చూస్తుంటే దర్శకుడు శంకర్ మాత్రం అదేమీ పట్టనట్టు సీరియస్ గా ఇండియన్ 2 పనుల్లో యమా బిజీగా ఉన్నాడని చెన్నై టాక్. ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన భారతీయుడుకి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందట. కమల్ ఇప్పుడు రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆ కోణంలోనూ అలోచించి శంకర్ కొన్ని కీలక మార్పులు చేసుకున్నట్టు సమాచారం. ఇకపోతే ఇందులో ఇంకా చాలా విశేషాలే ఉంటాయట.

కొడుకు పాత్ర ఫస్ట్ పార్ట్ లోనే చనిపోయింది కాబట్టి కథ మొత్తం ముసలి సేనాపతి పాత్ర మీదే నడిపించడం కష్టం. అందుకే శంకర్ దీన్ని మల్టీ స్టారర్ గా మార్చే ఆలోచనలో ఉన్నాడట. ఇందు కోసం ఇప్పటికే శింబుతో చర్చలు జరిపినట్టు వినికిడి. నవాబ్ లో అద్భుతమైన పెర్ఫార్మన్స్ రాబట్టుకుని తన ఇమేజ్ ని పెంచిన మణిరత్నం అంటే శింబు చాలా స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. అంతే కాదు ఫిమేల్ లీడ్ రోల్స్ కోసం నయనతార-కాజల్ అగర్వాల్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. సుకన్య పాత్ర ఎలాగూ కంటిన్యూ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లెమ్. విలన్ గా అజయ్ దేవగన్ ను ప్రయత్నిస్తే కాల్ షీట్స్ సమస్య వల్ల నో చెప్పాడట. అందుకే తన 2.0 పక్షి రాజు అక్షయ్ కుమార్ నే మరోసారి తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

శంకర్ వర్కింగ్ స్టైల్ కి ఫిదా అయిపోయిన అక్షయ్ డేట్స్ ఇబ్బంది వచ్చినా శంకర్ అడిగితే మాత్రం చేస్తాను అని సన్నిహితులతో అన్నట్టు తెలిసింది. సంగీత బాధ్యతలు ఏఆర్ రెహమాన్ కే అప్పగించబోతున్నారు. లైకా సంస్థ ప్రాధమికంగా దీని కోసం నూటా యాభై కోట్ల బడ్జెట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఒకవేళ 2.0 మొత్తం పెట్టుబడి వెనక్కు ఇస్తే ఇండియన్ 2కు ఎక్కువ కేటాయిస్తారట. మొత్తానికి ఇండియన్ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్ళడానికి ముందే చర్చల్లోకి వచ్చేసింది  
    

Tags:    

Similar News