బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సందేశాత్మకమైన చిత్రాలను తెరకెక్కించడంలో తన స్టార్ ఇమేజ్ ను కూడా లెక్క చేయడని మరోసారి రుజువైంది. రీసెంట్ గా శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కించిన "టాయిలెట్- ఏక్ ప్రేమ్ కథా" సినిమా అందరి మన్ననలను అందుకొని 100 కోట్ల బాక్స్ ఆఫీస్ ను దాటుతూ రికార్డులను సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అందరిలో ఆసక్తిని రేపింది. దేశంలో బహిర్భూమికి వెళ్లే వారి కష్టాల గురించి అలాగే స్త్రీలు ఎదుర్కునే అవమానాల గురించి చెబుతూ.. తీసిన ఈ సినిమాను చిత్ర యూనిట్ సక్సెస్ ను అందుకుంది.
అయితే చిత్రం గురించి మొదట కొంత విమర్శలు వచ్చాయట. ప్రభుత్వం కోసమే అక్షయ్ ఈ సినిమా ద్వారా ప్రచారం చేస్తున్నాడని చెప్పినవారే ఇప్పుడు థియేటర్లో విజిల్స్ వేస్తున్నారని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సమాధానాన్ని ఇచ్చాడు అక్షయ్. అలాగే దేశంలో ఈ సినిమా ఒక మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. గత ఎనిమిది నెలలుగా బహిర్భూమికి వెళ్లేవారి సంఖ్యా 54% నుంచి 34% వరకు వచ్చిందని. ఇప్పుడు ఆ 34 శాతం కూడా ఈ సినిమా ద్వారా సున్నాకి చేరాలని చెప్పాడు.
ఇక ఈ సినిమా హిట్ అయినా కాకపోయినా బహిర్భూమి అనే అంశం వల్ల కలిగే ఇబ్బందులను ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తుందని అనుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదలు తెలిపాడు. ప్రస్తుతం అక్షయ్ ప్యాడ్ మ్యాన్ - గోల్డ్ చిత్రాలతో పాటు రజినీకాంత్ 2.0 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.