అక్ష‌య్ Vs సైనా.. కాపీ ట్వీట్లు! డ‌బ్బు తీసుకుని కొంద‌రు! అంటూ నెటిజ‌నుల కౌంట‌ర్లు!!

Update: 2021-02-04 12:10 GMT
రైతు చ‌ట్టాల వ్య‌వ‌హారంలో కేంద్రానికి వ్య‌తిరేకంగా పంజాబ్ రైతులు నిర‌స‌న‌ల‌తో దిల్లీని అట్టుడికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో పెద్ద ఎత్తున సెల‌బ్రిటీ ట్వీట్లు సంచ‌ల‌నంగా మారాయి. అయితే అందులో కిలాడీ అక్ష‌య్ కుమార్ ట్వీట్ కి .. బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ ట్వీట్ కి ఇంచుమించు సారూప్య‌త‌లు ఉన్నాయ‌ని .. అవి కాపీ ట్వీట్లు అని తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

దేశ స‌మగ్ర‌త‌ను కాపాడేలా.. ఐక్య‌త‌ను చెడగొట్ట‌వ‌ద్ద‌న్న సారాంశం ఆ ఇద్ద‌రి ట్వీట్ల‌లో బ‌య‌ట‌ప‌డ‌గా... నెటిజ‌నుల్లో కాపీ ట్రోల్స్ స్టార్ట‌య్యాయి.అక్షయ్ కుమార్-సైనా నెహ్వాల్ 'ప్రచారం' ట్వీట్ పదం పదం కాపీ అని.. 'ఇండియా టుగెదర్' కోసం ఇది టూమ‌చ్! అంటూ కౌంట‌ర్లు ప‌డిపోయాయి.బాలీవుడ్ ‌ట్వీట్ల వ‌రుస‌లో అక్షయ్ కుమార్ .. సైనా నెహ్వాల్ ఒకరి ట్వీట్లను ఒక‌రు కాపీ చేసే ముందు దానిని అస్స‌లు పట్టించుకోలేదు. ఇప్పుడు.. ఎవరు ఆ ట్వీట్ ని కాపీ చేసారు! అన్న‌దే అస‌లు పాయింట్ అంటూ నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగింది.

సైనా ట్వీట్ ఉదయం 11:00 గంటలకు వైర‌ల్ అయ్యింది. "రైతులు మన దేశంలో చాలా ముఖ్యమైన భాగం. వారి సమస్యలను పరిష్కరించడానికి తీసుకుంటున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తేడాలు సృష్టించే ఎవరిపైనా శ్రద్ధ చూపకుండా.. స్నేహపూర్వక తీర్మానానికి మద్దతు ఇద్దాం. # ఇండియా టుగెద‌ర్‌.. #ఇండియా ఎగైనిస్ట్ ప్రొప‌గండా" అంటూ సైనా ట్వీట్ చేసింది. సేమ్ టు సేమ్ అక్షయ్ ట్వీట్ బుధవారం ఉదయం 6 గంటలకు వైర‌ల్ అయ్యింది. ఆ త‌ర్వాత‌ ట్విట్ట‌ర్ లో కాపీ అన్న టాక్ వినిపించింది. అంత‌ర్జాతీయ పాప్ స్టార్ రిహ‌న్నా రైతుల‌కు అనుకూలంగా భారత రైతులకు సంఘీభావం తెలుపుతూ ప్ర‌భుత్వ తీరును వ్య‌తిరేకించిన అనంత‌రం బాలీవుడ్ ప్ర‌ముఖుల ట్వీట్లు సంచ‌ల‌నం అయ్యాయి.

చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు క్రీడా ప్రముఖులు ఒకే ట్యూన్ ని వినిపించారు.  'దేశం ఐక్య‌త‌ను పేరు చెడ‌గొట్టే ప్రచారానికి వ్యతిరేకంగా' స‌మ‌గ్ర‌త‌ను కాపాడటానికి తమ వంతు సహకారం అందించే ప్ర‌య‌త్నం చేశారు.ఏక్తా కపూర్ - కరణ్ జోహార్- అజయ్ దేవ్‌గన్ -అక్షయ్ కుమార్-  సచిన్ టెండూల్కర్ ఇలాంటి సెల‌బ్రిటీలంతా ఇంటర్నెట్ లో ట్వీట్ల‌తో హాట్ టాపిక్ అయ్యారు. రైతుల పేరుతో భారతదేశాన్ని విభజించే అవకాశం ఉన్న ఏ ప్రచారానికైనా పడిపోవద్దని వారు దేశ ప్రజలను కోరారు.

ఇక ఈ ఎపిసోడ్ లో డ‌బ్బు చెల్లింపుల‌కు ట్వీట్లు అన్న టాపిక్ స‌ప‌రేట్ గా డిబేట్ కి వ‌చ్చింది. బాలీవుడ్ ‌కు చెందిన పలువురు ప్రముఖులు తమ తోటి పరిశ్రమ ప్రజలు ఈ సమస్యపై స్పందించిన తీరును ఖండించారు. ఒత్తిడి వ‌ల్ల‌ లేదా డ‌బ్బు తీసుకుని దేశానికి వ్య‌తిరేకంగా మాట్లాడార‌ని కూడా దీనిపై చ‌ర్చ సాగింది.
Tags:    

Similar News