'అల‌..' హిందీ రిలీజ్‌పై మ‌రో ట్విస్ట్‌!

Update: 2022-01-22 13:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్‌`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం వ‌రల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా వ‌సూళ్ల ప‌రంగానూ స‌రికొత్త రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది. ర‌ష్మిక మంద‌న్న న‌టించిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌కు మించి బాలీవుడ్ లో మ‌రీ ముఖ్యంగా ఉత్త‌రాదిలో భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన విష‌యం తెలిసిందే.  

ఈ మూవీతో బ‌న్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దీంతో ఆయ‌న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌ని గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ అధినేత మ‌నీష్ షా ప్లాన్ చేశాడు. ఆలోచ‌న వ‌చ్చిందే అద‌నుగా అల్లు అర్జున్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అల వైకుంఠ‌పుర‌ములో` హిందీ డ‌బ్బింగ్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 26న దేశ వ్యాప్తంగా హిందీ డబ్బింగ్ వెర్ష‌న్ ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ఓ పోస్ట‌ర్ ని కూడా విడుద‌ల చేశాడు.  

దీంతో ఈ చిత్రాన్ని `షెహ‌జాదా` పేరుతో రీమేక్ చేస్తున్న వారు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ రిలీజ్ చేస్తే మా ప‌రిస్థితి ఏంట‌ని రంగంలోకి దిగారు. వెంట‌నే అల్లు అర‌వింద్ ని లైన్ లోకి తీసుకొచ్చి స‌ద‌రు డ‌బ్బింగ్ వెర్ష‌న్ రిలీజ్ ని నిలిపి వేసేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ అధినేత మ‌నీష్ షా ఈ చిత్ర విడుద‌ల‌ని నిలిపి వేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. దీంతో వివాదం స‌మ‌సిపోయింది అని అంతా ఊప‌రి పీల్చుకున్నారు.

ఇదిలా వుంటే గోల్డ్ మైన్స్ టెలీఫిల్మ్స్ అధినేత మ‌నీష్ షా శ‌నివారం `షెహ‌జాదా` టీమ్ కి మ‌రో షాకిచ్చారు. ఈ చిత్రాన్ని హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డం లేద‌ని తెలిపిన ఆయ‌న త‌న సొంత టీవీ ఛాన‌ల్ దించ‌క్ టీవీలో మాత్రం ఫిబ్ర‌వ‌రి 6న ఈ చిత్ర హిందీ వెర్ష‌న్ ని ప్రీమియ‌ర్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. దీనిపై `షెహ‌జాదా` టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News