తెలుగు మూవీ మేకర్లు తమ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలో ఒకరిద్దరు పేరున్న నటులను పెట్టుకుని, మిగతా పాత్రలను చోటామోటా నటులతో నింపేస్తూ ఉంటారు. అయితే దర్శకరచయిత త్రివిక్రమ్ మాత్రం అందుకు భిన్నం. తన సినిమా నిండా పేరున్న ఆర్టిస్టులను పెట్టుకోవడానికే ఈ దర్శకుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. మొదటి నుంచి అలానే అయినప్పటికీ.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నుంచి ఇది మరింత ఎక్కువైంది!
ఆ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుల పాత్రలకే పెద్ద వాళ్లను తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. ఉపేంద్రలోని కొత్త యాంగిల్ ను పరిచయం చేశాడు. స్నేహానూ చూపించాడు, రాజేంద్ర ప్రసాద్ బోనస్. ఆపై అంత ప్రాధాన్యత లేని పాత్రకే నిత్యామీనన్ ను ఒప్పించాడు!
ఇక ఆ తర్వాత కూడా అదే కథ కొనసాగుతూ ఉంది. ‘అరవింద సమేత..’లో కూడా తెరనిండా గుర్తింపు ఉన్న వాళ్లను చూపించాడు. ఇక ‘అల వైకుంఠాపురం’ సినిమాకు కూడా త్రివిక్రమ్ ఫార్ములా ఏమీ మారలేదని స్పష్టం అవుతోంది.
ఈ సినిమాలోనూ రాజేంద్రప్రసాద్ తో సహా చాలా మందే కనిపిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా యూనిట్ సెల్పీలో ప్రముఖులు కనిపించారు.
వారిలో మలయాళీ నటుడు జయరాం, సీనియర్ నటి టబు, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి తదితరులు ఉన్నారు. ఇంకా ఈ సెల్ఫీలో కొందరు మిస్ అయ్యారట. వారే.. సుశాంత్, నివేదా పేతురాజ్ ఈ సెల్ఫీలో లేరట. మొత్తానికి తారాగణం విషయంలో త్రివిక్రమ్ సినిమా సినిమాకూ తెర బరువును పెంచేస్తూ ఉన్నట్టున్నాడు!