నెట్ ఫ్లిక్స్ చేతికి అల వైకుంఠ‌పుర‌ము లో

Update: 2019-12-07 04:38 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడు గా న‌టిస్తున్న చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌కుడు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్- గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే - నివేద పెథురాజ్ క‌థానాయిక‌లు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం రిలీజ‌వుతోంది. ప్ర‌మోష‌న్స్ లో అల టీమ్ స్పీడ్ గురించి తెలిసిందే. ప్రీ రిలీజ్ బిజినెస్ లోనూ బ‌న్ని బృందం స్పీడ్ చూపిస్తున్నారు.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన లిరిక‌ల్ వీడియోలు.. టీజ‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఆ క్ర‌మంలోనే థియేట్రిక‌ల్ రైట్స్ ప‌రంగా ఏరియా వైజ్ బిజినెస్ కి డిమాండ్ నెల‌కొంద‌ట‌. నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ ప‌రంగానూ బ‌న్ని స్టార్ డ‌మ్ దృష్ట్యా డిమాండ్ బావుంద‌ని తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. అల వైకుంఠ‌పుర‌ములో డిజిట‌ల్ రైట్స్ ని భారీ పోటీ న‌డుమ విదేశీ స్ట్రీమింగ్ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని ఇప్ప‌టికే ఓ ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ చానెల్ రికార్డ్ ధ‌ర‌కు చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే శాటిలైట్ ధ‌ర‌ తో ప‌ని లేకుండా డిజిట‌ల్ లోనూ పెద్ద ధ‌ర ప‌లికింద‌ని తెలుస్తోంది.

ఇక ఇటీవ‌లి కాలంలో డిజిట‌ల్ స్ట్రీమింగ్ కంపెనీల రూల్స్ మారాయ‌ని ప్ర‌చార‌మైంది. వ్యూవ‌ర్ షిప్ ఆధారంగా ధ‌ర‌ల్ని నిర్ణ‌యించాల‌ని అమెజాన్- నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ఓ ప్ర‌చారం వేడెక్కింది. దీంతో విదేశీ స్ట్రీమింగ్ కంపెనీల‌కు కాకుండా లోక‌ల్ స్ట్రీమింగ్ సంస్థ‌ల‌కే డిజిట‌ల్ రైట్స్ క‌ట్టబెట్టాల‌ని నిర్మాత‌ల మండ‌లి లో ప్ర‌తిపాదించార‌ని వార్త‌లొచ్చాయి. అయితే ఈ ప్ర‌చారం తో ప‌ని లేకుండా స్టార్ హీరోల సినిమాల‌కు డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ధ‌ర ప‌లుకుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.


Tags:    

Similar News