20వేల సంవత్సరాల కిందటి కథ 'ఆల్ఫా'

Update: 2018-08-12 01:30 GMT
మానవ మనుగడలో జంతువుల సాయం మరువలేనిది.. ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడిగా ఎదిగే క్రమంలో మనిషి తన అవసరాల కోసం ఆవులు - గేదెలన - గుర్రాలను - కుక్కలను మచ్చిక చేసుకున్నాడు. వాటితో ఆహారం సంపాదించుకొని ఎదిగాడు. ఇప్పుడీ అద్భుతమైన అడ్వంచర్ థ్రిల్లర్ కథాంశాన్ని తీసుకొని హాలీవుడ్ నుంచి మరో సినిమా వస్తోంది. అదే ‘ఆల్ఫా’. ఈ హాలీవుడ్ చిత్రం తెలుగు - తమిళం - ఆంగ్ల భాషల్లో సోనీ పిక్చర్ సంస్త ద్వారా ఈనెల 24న విడుదలవుతోంది.

ఆల్ఫా కథ.. 20వేల సంవత్సరాల క్రితం నాటిది. అడవి ప్రాంతాల్లో నివసించే జాతి వేటే ప్రధాన వృత్తిగా జీవిస్తుంది. వారంతా ఓ రోజు వేటకు వెళతారు. ఈ క్రమంలోనే ఓ కుర్రాడు తప్పిపోతాడు. ఆ కుర్రాడు ఓ  గాయపడ్డ తోడేలును రక్షించి దాన్ని మచ్చిక చేసుకొని ఆహారాన్ని వేటాడుతుంటాడు. చివరకు ఆ కుర్రాడికి ఎదురైన సమస్యలు, అతడి తల్లిదండ్రులను ఎలా కలుసుకున్నాడు.. తోడేలు-మనిషికి మధ్య స్నేహబంధం ఎలా ఏర్పడిందనేదే అసలు కథ..

తాజాగా ఆల్ఫా మూవీ ట్రైలర్ విడుదలైంది. పూర్వం కాలంలోని సాహోసోపేతమైన సన్నివేశాలతో సినిమా ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది. కొడి స్మిత్ మెక్ ఫీ - లెఓనర్ వరేలా - జెన్స్  హాల్టెన్ - జోహన్స్ హక్కర్ జోహన్ సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ - దర్శకత్వం - సహనిర్మాతగా అల్బర్ట్ హగ్స్ నిర్వహించారు.ఈ చారిత్రక యాక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి ట్రైలర్ చూశాక అందరిలోనూ రెట్టింపు అయ్యింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News