ఆ 18 ఓటీటీలను బ్యాన్ చేయడానికి కారణం?
ఇష్ఠానుసరం అడల్ట్ కంటెంట్ ని ఓటీటీల్లో యథేచ్ఛగా ప్రసారం చేస్తూ టీనేజర్లను మభ్యపెడుతున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి.
స్కూల్ కాలేజ్ కి వెళ్లే టీనేజీ విద్యార్థులు, యూత్ ని టార్గెట్ చేస్తూ బూతు కంటెంట్ తో కొన్ని ఓటీటీలు గ్యాంబ్లింగ్ చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఇష్ఠానుసరం అడల్ట్ కంటెంట్ ని ఓటీటీల్లో యథేచ్ఛగా ప్రసారం చేస్తూ టీనేజర్లను మభ్యపెడుతున్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ప్రతిదీ సమాచార ప్రసారాల శాఖ స్క్రుటినీలో ఉంది. డిజిటల్ కంటెంట్ విషయంలో చట్టాలు కఠినతరంగా మారాయి. ఆన్ లైన్ - డిజిటల్ కంటెంట్ పై ఇప్పుడు కంట్రోల్ స్పష్ఠంగా ఉంది. అందుకే ఇక బూతు ఓటీటీలకు కాలం చెల్లినట్టేనని విశ్లేషిస్తున్నారు.
విశృంఖల కంటెంట్ తో డబ్బు సంపాదించాలని ఆశపడిన కొన్ని ఓటీటీలకు తాజాగా ప్రభుత్వం చెక్ పెట్టింది. అలాంటి వాటిని పరిశీలిస్తే.. హంటర్స్, రాబిట్, హాట్ షాట్స్ VIP, చికూఫ్లిక్స్ , ప్రైమ్ ప్లే, డ్రీమ్ ఫైల్స్, ఎక్స్‌ట్రామూడ్, న్యూఫ్లిక్స్, మూడ్‌ఎక్స్, మోజ్‌ఫ్లిక్స్, వూవి, యెస్మా, అన్‌కట్ అడ్డా, ట్రిక్ ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, నియాన్ ఎక్స్ వీఐపీ, ఫుగీ, బేషరమ్స్ వంటి 18 బి గ్రేడ్ ఓటీటీలను భారత ప్రభుత్వం నిషేధించింది. కంటెంట్ విషయంలో సమాచార ప్రసారాల శాఖ నిబంధనలను ఉల్లంఘించడం వల్లనే వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
ప్రస్తుత కాలంలో పోటీలో ఉన్న పాపులర్ ఓటీటీలకు డూప్లికేట్ పేర్లను సృష్టించి కొన్ని డిగ్రేడ్ ఓటీటీలు చెలామణిలో ఉన్నాయి. అడల్ట్ కంటెంట్ తో నడుస్తున్న ఇలాంటి వాటికి ఇక చెక్ పడిపోనుంది. ఇటీవల డిజిటల్ గా వినోదాన్ని ఆస్వాధించాలనుకునే ప్రేక్షకుల శాతం అంతకంతకు పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఓటీటీ కంటెంట్ పై పరిశీలన, నియంత్రణ చాలా అవసరమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు చెడిపోకుండా కాపాడేందుకు ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.