తెలుగు 'పంచాయత్' సిరీస్.. అందుకే అలా..
బాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్ కు తెలుగు రీమేక్ గా రూపొందిన సివరపల్లి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే.
బాలీవుడ్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ పంచాయత్ కు తెలుగు రీమేక్ గా రూపొందిన సివరపల్లి వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కామెడీ డ్రామాగా రూపొందిన ఆ సిరీస్.. జనవరి 24వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. టాప్-10 ర్యాంకింగ్స్ లో కూడా దూసుకుపోయింది!
కంప్లీట్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సహజత్వానికి ప్రాధాన్యనిస్తూ భాస్కర్ మౌర్య రూపొందించారు. నేచురల్ లొకేషన్స్ లో షూట్ చేసి.. నిజంగానే ఓ పల్లె జీవితాన్ని ప్రత్యక్షంగా చూపించారు. మురళీధర్ గౌడ్, పావని కరణం, రఘు మయూర్, జితేంద్ర కుమార్, రూప లక్ష్మి, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లె తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
సివరపల్లిలో రఘు మయూర్ తన ఉద్యోగాన్ని వదిలి అమెరికాకు వెళ్లాలని కలలు కనే గ్రామీణ గ్రామంలో పనిచేసే ప్రభుత్వ అధికారి పాత్రలో నటించారు. తన యాక్టింగ్ తో మెప్పించారు. మురళీధర్ గౌర్, సన్నీ పల్లెల తమ రోల్స్ లో ఒదిగిపోయారు. కానీ జితేంద్ర కుమార్.. హిందీ సిరీస్ లో అభిషేక్ త్రిపాఠి పోషించిన రోల్ లో కనిపించారు.
పంచాయత్ లో అభిషేక్ పాత్రకు ఒక ప్రత్యేకమైన వైబ్ ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కానీ ఇప్పుడు జితేంద్ర అంతగా మెప్పించలేదని రివ్యూస్ ఇచ్చాయి. మిగతా రోల్స్ లో కొందరు ఆకట్టుకోలేదని అంటున్నారు. మరికొందరు మాత్రం మంచి ప్రదర్శనలు ఇచ్చిన ప్రయత్నం చేసినప్పటికీ.. తెలుగు సిరీస్ ఫుల్ గా కనెక్ట్ అవ్వలేదని చెప్పాలి.
ప్రధానంగా సౌత్ లో కూడా పంచాయత్ సిరీస్ ను విస్తృతంగా వీక్షించిన విషయం తెలిసిందే. సూపర్ సక్సెస్ అయింది. కాబట్టి రీమేక్ కావడంతో సివరపల్లి సిరీస్ కు క్లీన్ ప్రశంసలు లభించడం లేదు. పంచాయత్ లో ఉన్న ఫ్రెష్ నెస్ తోపాటు స్పెషల్ డైనిమిక్స్.. తెలుగు సిరీస్ లో మిస్ అయిందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
చెప్పాలంటే.. అనేక మంది ఓటీటీ ప్రియుల మదిలో పంచాయత్ ఒరిజినల్ సిరీస్ క్యాస్టింగ్ యాక్టింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు తెలుగు సిరీస్ సివరపల్లిలో నటించిన వారిని అంగీకరించడం సవాలుగా మారింది. అందుకే ఎఫెక్ట్ చూపించడం లేదని టాక్ వినిపిస్తోంది. మరి ఫ్యూచర్ లో ఏమైనా మంచి వ్యూస్ అందుకుంటుందో వేచి చూడాలి.