బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలో అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో 'సూపర్ సోల్జర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా కరోనా ముందు ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా రాకతో షూటింగ్ ఆపేసారు.
ఆ తర్వాత వైరస్ ప్రభావం తగ్గినా సినిమాని పట్టించుకోలేదు. ఈ క్రమంలో కత్రినా వేర్వేరు సినిమాలతో బిజీ అయింది. దీంతో సూపర్ సోల్జర్ టాపిక్ ఎక్కడా రాలేదు. దర్శకుడు ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో సినిమా రద్దు అయిందని బాలీవుడ్ మీడియాలో ప్రచారం సాగింది.
అయితే ఈ సినిమా ఆగిపోలేదు ఉందంటూ దర్శకుడు మళ్లీ తెరపైకి వచ్చారు. 'సినిమా షూటింగ్ మొదలు పెట్టే సమయంలో క్యాట్ 'టైగర్ -3' షూటింగ్లో బిజీగా ఉంది. దాని తర్వాత లాక్ డౌన్ ప్రకటించారు.
ఎంత ఆలస్యమైనా సినిమాని తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే సినిమాని మళ్లీ సెట్స్ పైకి తీసుకెళ్తాం. ఈసారి మొదలైతే ఆపేది లేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చిత్రీకరణ పూర్తిచేస్తాం' అని తెలిపారు.
దీంతో సూపర్ సోల్జర్ మళ్లీ పున ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. ఇదొక భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో 'మేరే బ్రదర్ కీ దుల్హాన్' ..'టైగర్ జిందా హై'.. 'భారత్' చిత్రాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇవన్నీ మంచి విజయం సాధించాయి. దీంతో ఈ కాంబోలో కొత్త సినిమా ప్రకటించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ కరోనా కల్లోలం వాటిని నాశనం చేసింది.
అయినా తగ్గేదేలే అంటూ మళ్లీ బరిలోకి దిగుతున్నారు. ఇందులో షారుక్ ఖాన్ అతిది పాత్ర పోషిస్తు న్నారు. ఇంకా స్టోరీ డిమాండ్ చేస్తే మరింత మంది స్టార్లని రంగంలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కత్రినా ఇప్పుడు సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్ కి సమయం కేటాయించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలకు తొందరపడి సైన్ చేయడం లేదు. ప్రస్తుతం 'టైగర్ -3' తో పాటు...'మేరి క్రిస్మస్' సినిమా చేస్తుంది. ఇప్పుడు 'సూపర్ సోల్జర్' షూటింగ్ హాజరు కానుంది.