రోల్ రివర్స్ అనేసిన కరీనా!!

Update: 2017-03-16 07:15 GMT
బాలీవుడ్ లో రోల్స్ రివర్స్ అయిపోవడం అరుదుగా జరిగే విషయం. కానీ హీరోయిన్స్ విషయంలో మాత్రం జరుగుతూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని బైటకు మాత్రం చెప్పరు.. ఒప్పుకోరు. కానీ కరీనా కపూర్ మాత్రం నిజాయితీగా చెప్పేసింది.

గత కొన్ని ఇంటర్వ్యూలలో ఆలియా భట్ ఓ విషయాన్ని పర్టిక్యులర్ గా చెప్పేది. 'నేను కరీనా కపూర్ కి పెద్ద ఫ్యాన్ ని.. ఆమెను ఆమె సినిమాలను చూస్తూ పెరిగాను. నాకు ఇన్ స్పిరేషన్ మాత్రమే కాదు.. నా ఫేవరేట్ కూడా కరీనానే' అని చెబుతూ ఉంటుంది ఆలియా. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్ లో ఆలియా భట్ కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును కరీనా కపూర్ చేతుల మీదుగా ఇప్పించారు ఆహుతులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ఆలియా పెర్ఫామెన్స్ సినిమా సినిమాకి బాగా ఇంప్రూవ్ అయిపోతోంది' అని చెప్పింది కరీనా.

'నాకు మా రోల్స్  తారుమారు అయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు నేను ఆలియాకి ఫ్యాన్ అయిపోయాను. తన సినిమాలు చూస్తుంటే భలే హ్యాపీగా ఉంటుంది. రిస్క్ లు తీసుకోవడానికి.. డిఫరెంట్ రోల్స్ చేయడానికి కూడా తను సాహసిస్తుంది. తన ఫ్యాన్ ని కాబట్టే నేను ఇక్కడకు వచ్చాను' అని చెప్పింది కరీనా కపూర్ ఖాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News