#BoycottAlia.. ఆలియా పురుషులపై గృహహింస

Update: 2022-08-04 13:30 GMT
ఆలియా మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె నటించిన డార్లింగ్స్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నటిగా తనను తాను మరోసారి విభిన్నంగా చూపించేందుకు గాను డార్లింగ్స్ పాత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు కనిపించని విభిన్నమైన పాత్రలో కనిపించేందుకు గాను సిద్ధం అయ్యింది. హీరోయిన్‌ గా ఇప్పటి వరకు ఎన్నో కమర్షియల్‌ పాత్రల్లో కనిపించాను కాని ఇది విభిన్నం అంటూ ఆలియా చెబుతోంది.

సినిమాకు కావాల్సినంత ప్రమోషన్‌ చేశారు. ఆలియా అభిమానులతో పాటు అంతా కూడా సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. వచ్చిన వెంటనే స్ట్రీమింగ్‌ చేయాలని నెట్‌ ఫ్లిక్స్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సినిమా ను బ్యాన్ చేయాలని.. బహిష్కరించాలంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆలియా అండ్‌ ఆమె టీమ్‌ కు ఇబ్బందికరంగా మారాయి.

జస్మిత్ కే రిన్‌ దర్శకత్వంలో రూపొందిన డార్లింగ్స్ సినిమా ప్రమోషనల్‌ స్టఫ్‌ అంటే పోస్టర్స్ మరియు టీజర్‌ ల్లో మగవారి పై గృహ హింసకు పాల్పడుతున్నట్లుగా చూపించారు. కట్టేసి అత్యంత దారుణంగా హింసించడంతో పాటు హింసను ప్రోత్సహించేలా.. ప్రేరేపించేలా ఆలియా భట్ సినిమా డార్లింగ్‌ స్టిల్స్ ఉన్నాయి అనేది విమర్శ.

ఆడవారిపై గృహ హింసను సహించని వారు ఇప్పుడు మగవారి పై గృహ హింస సినిమాను ఎలా ఆడనిస్తారు అంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా పిలుపునిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ సినిమా బ్యాన్‌ చేయాల్సిందే అనే డిమాండ్ ను సోషల్‌ మీడియా ద్వారా మగవారు ఎక్కువ శాతం మంది వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.

#BoycottAliaBhatt మరియు #BoycottDarlings అనే హ్యాష్ ట్యాగ్స్ ను ఆలియా కు వ్యతిరేకంగా మరియు డార్లింగ్‌ సినిమాకు వ్యతిరేకంగా ట్రెండ్‌ చేస్తున్నారు. ఆలియా ఈ విషయమై ఇప్పటి వరకు స్పందించలేదు. నెట్‌ ఫ్లిక్స్ నుండి కూడా ఎలాంటి క్లారిటీ ఇంకా రాలేదు. స్ట్రీమింగ్ రేపటి నుంచి ఏమాత్రం మార్పు లేకుండా ప్రారంభం కాబోతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.
Tags:    

Similar News