జోక్ చేశాడు.. జనాలు సీరియస్ గా తీసుకున్నారంటూ నటి క్లారిటీ

Update: 2022-07-28 04:47 GMT
బాలీవుడ్ స్టార్ నటుడు రణ్ బీర్ కపూర్ నోటి నుంచి వచ్చిన సరదా మాటను జనాలు సీరియస్ గా తీసుకోవటం.. అతగాడి సతీమణి అలియా భట్ కు ఇబ్బందికరంగా మారింది. దీంతో.. తన భర్త జోక్ చేశాడని.. నిజం కాదన్న విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. బాలీవుడ్ ప్రేమపక్షలుగా సుపరిచితులైన రణ్ బీర్.. ఆలియాభట్ లు గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లైన రెండు నెలలకే తాను తల్లిని కాబోతున్నట్లుగా ఆలియా వెల్లడించారు. కట్ చేస్తే.. తాజాగా ఒక షోలో మాట్లాడిన రణ్ బీర్.. సరదాగా తమకు ట్విన్స్ పుట్టనున్నట్లుగా కామెంట్ చేశారు.

యాంకర్ సరదాగా పెట్టిన టాస్క్ లో.. ఒక అబద్ధం.. రెండు నిజాలు చెప్పాలనగా.. ట్విన్స్ పుడుతున్నట్లుగా చెప్పారు. అది నిజమో.. అబద్ధమో మీరే చెప్పుకోవాలన్న ఆయన మాటలకు జనాలు ఆలియాకు ట్విన్స్ గా భావించటం.. అదికాస్తా చర్చగా మారింది.

నిజానికి ఒక జంటకు పెళ్లి తర్వాత పుట్టే బిడ్డ గురించి ఆసక్తి ఉంటుంది. సెలబ్రిటీల విషయం అది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఇలాంటి విషయాలు సెలబ్రిటీలకు కొన్నిసార్లు ఇబ్బందికరంగా మారతాయి.

ఆలియా విషయంలోనూ అదే జరిగింది. తనకు ట్విన్స్ పుట్టబోతున్నారంటూ రణ్ బీర్ సరదాగా చెబితే.. జనాలు సీరియస్ గా తీసుకొని ప్రశ్నలు వేస్తున్న క్రమంలో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తనకు ఒక్క బిడ్డే పుట్టనున్నట్లుగా ఆమె స్పష్టం చేశారు. అమ్మాయిలకు పెళ్లైతే ఒక టాపిక్.. తల్లి కాబోతున్నది మరో టాపిక్. ఇలా ఏదైనా టాపిక్కే అవుతుందని.. పెళ్లి.. తల్లి కావటం వ్యక్తిగత విషయాలని ఆమె చెప్పినప్పటికీ.. తాము అభిమానించే వారికి సంబంధించిన విషయాలకు జనాలు మరింత ఆసక్తిని చూపిస్తారన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఆలియాకు ఉందని చెప్పాలి.
Tags:    

Similar News