RRR టీమ్ తో ఆలియా జాయిన్

Update: 2019-03-28 04:43 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి RRR చిత్రీక‌ర‌ణ‌లో అహోరాత్రులు శ్ర‌మించి త‌పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉలి వేసి శిల్పిలా చెక్కుతున్నాడ‌న్న స‌మాచారం ఉంది. ముఖ్యంగా సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌ను - కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్ పాత్ర‌ను అద్భుతంగా తీర్చిదిద్దాడ‌ట‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలియ‌ని ఫిక్ష‌న్ వీరుల్ని సిల్వ‌ర్ స్క్రీన్ పై చూపిస్తున్నామ‌ని - స్వాతంత్రోద్య‌మానికి ముందు ఆ ఇద్ద‌రూ వీరులుగా రూపాంత‌రం చెందిన‌ వైనం ఎలాంటిదో - అప్ప‌ట్లో ఆ ఇద్ద‌రూ క‌లిసి ఆంగ్లేయుల‌పై పోరాటం చేసి ఉంటే ఏం జ‌రిగేదో ఫిక్ష‌నైజ్ చేసి తెర‌పై ఆవిష్క‌రిస్తున్నామ‌ని ఇదివ‌ర‌కూ మీడియా మీట్ లో తెలిపారు. ఈ సినిమాలో సీత పాత్ర (చెర్రీ నాయిక‌) కు బాలీవుడ్ యువ‌నాయిక ఆలియా భ‌ట్ ని - ఎన్టీఆర్ స‌ర‌స‌న‌ ఇంగ్లీష్ బ్యూటీ డైజీ ఎడ్గార్ ల‌ను ఎంపిక చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగే మ‌రో స‌మ‌ర‌యోధుడిగా యాక్ష‌న్ గ‌న్ అజ‌య్ దేవ‌గ‌ణ్ ని ఎంపిక చేసుకున్నారు.

అయితే సీత పాత్ర‌ధారి ఆలియా - స‌మ‌ర‌యోధుడు దేవ‌గ‌ణ్ ఎప్ప‌టి నుంచి షూటింగ్ లో పాల్గొంటారు? అస‌లు ఆ ఇద్ద‌రికీ తెలుగు వీరుల పోరాటంతో క‌నెక్ష‌న్ ఏమైనా  ఉంటుంది? అంటూ అభిమానుల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. తాజా స‌మ‌చారం ప్ర‌కారం.. ఆ ఇద్ద‌రితో క‌నెక్టివిటీ పూర్తిగా ఉత్త‌ర భార‌తం క‌నెక్టివిటీ అని అర్థ‌మ‌వుతోంది. అందుకే జ‌క్క‌న్న ఉత్త‌రాంధ్ర‌లో షూటింగ్ ప్లాన్ చేశారు. అంటే ఆ రెండు పాత్ర‌ల్ని ఉత్త‌రాంధ్ర క‌నెక్టివిటీతోనే ర‌చ‌యిత విజ‌యేంద్రుడు తీర్చిదిద్దార‌ని అర్థం చేసుకోవచ్చు. ఇప్ప‌టికే ఆలియా భ‌ట్ ఆన్ లొకేష‌న్ జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతోంద‌ని స‌మాచారం. ఉత్త‌రాంధ్ర‌లో ప‌లు అంద‌మైన లొకేష‌న్ల‌లో ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చేసేలా షెడ్యూల్ ని డిజైన్ చేవారు. చ‌ర‌ణ్‌ - తార‌క్ స‌హా ప్ర‌ధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొన‌బోతున్నారు. అలాగే ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ నాయిక డైజీ కూడా షూటింగ్ లో పాల్గొన‌నుంది.

అయితే యాక్ష‌న్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ మాత్రం ఇంకా సెట్స్ లో యాక్ష‌న్ కి జాయిన్ కాలేదు. ప్ర‌స్తుతం అత‌డు ఓ హిందీ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. వ‌రుస‌గా సినిమాలతో బిజీగానూ ఉన్నారు. అందువ‌ల్ల ఆర్‌.ఆర్‌.ఆర్ కి ఒకేసారి మొత్తం షూట్ పూర్త‌య్యేలా గంప‌గుత్త‌గా కాల్షీట్లు ఇస్తార‌ట‌. అటుపై అత‌డితో చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ పాత్ర‌ధారుల్ని ప‌రిచ‌యం చేసిన స‌మ‌యంలోనే 30 జూలై 2020 తేదీని లాక్ చేశామ‌ని జ‌క్క‌న్న టీమ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్ తో డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామ‌ని తెలిపారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News