#మీటూ: స్టార్‌ హీరోయిన్‌ తల్లిని కూడా వదల్లేదట

Update: 2018-10-24 15:42 GMT
బాలీవుడ్‌ నటి తనూశ్రీ ప్రముఖ నటుడు నానాపటేకర్‌ పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దాంతో మీటూ ఉద్యమం ఇండియాలో తీవ్ర రూపం దాల్సింది. సినీ పరిశ్రమలో పనిచేసే నటీమణులు అంతా కూడా తమపై జరిగిన లైంగిక దాడులను బయటపెడుతున్నారు. కేవలం సినీ రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో పనిచేసే మహిళలు కూడా తమపై జరిగిన ఘటనలను బహిర్గతం చేస్తున్నారు. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ అలియాభట్‌ తల్లి సోని రజ్దాన్‌ కూడా తనపై జరిగిన లైంగిక దాడులను మీటూలో భాగంగా బయట పెట్టారు.

తాజాగా మీడియాతో ముచ్చటించిన సినీ నటి - బుల్లితెర నటి సోని రజ్దాన్‌ గతంలో తనకు ఎదరైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఒక సినిమా సందర్భంలో సదరు సినిమాకు పనిచేసే వ్యక్తి తనపై అత్యాచారం చేయాబోయాడని. అప్పుడు తాను చాలా తెలివిగా తప్పించుకున్నాను - అదృష్టవశాత్తు ఆరోజు బయట పడగలిగాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తి కుటుంబం ఇబ్బందుల్లో పడుతుందనే ఆలోచనతో ఎవరికి చెప్పలేదు - ఆ తర్వాత సదరు వ్యక్తి చాలాసార్లు కలిశాడు కానీ నేను మాత్రం అతడితో మాట్లాడలేదు అంటూ సోనీ రజ్దాన్‌ చెప్పుకొచ్చారు.

లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న అలోక్‌ నాధ్‌ అందరితో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడు, అతడు మద్యం సేవిస్తే మరింత రెచ్చిపోతాడు - అతడు నన్ను చూసే విదానం నాకేమాత్రం నచ్చదు అని అలియా తల్లి ఆరోపించారు. మీటూలో భాగంగా యువ నటీమణులు - సినీ పరిశ్రమలో పనిచేసే యువతులు తమపై జరిగిన లైంగిక దాడులను బయటపెడుతున్నారు. అయితే సీనియర్‌ నటీమణులు మాత్రం ఇంత వరకు నోరు విప్పలేదు. సోనీ రజ్దాన్‌ వ్యాఖ్యలతో మరే సీనియర్‌ హీరోయిన్‌ అయినా మీ టూ లో భాగం అవుతుందో చూడాలి. సీనియర్‌ హీరోయిన్లు కూడా ఇవి మొదలు పెడితే మీ టూ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చుతుంది.
Tags:    

Similar News