కంగనా విమర్శలపై నా స్టాండ్ ఇదే: అలియా

Update: 2019-04-23 04:10 GMT
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.. నువ్వు పక్కవారి వైపు ఒకవేలు చూపిస్తే నీవైపు నాలుగు వేళ్ళు చూస్తాయి.. ఇలా నోటి దురుసుతనం గురించి ఎన్నో సామెతలు ఉన్నాయి.  అంతే కాదు.. చైనాలో అయితే దీనికి ఒక నీతి కథే ఉంది.  పళ్ళు ఆలస్యంగా వస్తాయట కానీ గట్టిగా ఉంటాయి.. అయితే అన్నిటికంటే ముందు పోయేవి అవే.  కానీ నాలుక మెత్తగా ఉంటుంది కానీ చచ్చేదాకా మనతోనే ఉంటుంది.. అంటే కటువైన మాటలు కాదు ప్రియమైన మాటలు మాట్లాడాలి.. అవే చిరకాలం నిలిచి ఉంటాయి అని అర్థం.  కానీ ఈ విషయాన్ని ఈమాత్రం పాటించకుండా నోరుండేది విమర్శించడానికి అన్నట్టుగా చేలేరేగిపోతూ ఉంటుంది కంగనా రనౌత్. ఆమె తానా అంటే ఆమె సోదరి రంగోలి చందేల్ తందాన అంటుంది.
 
బాలీవుడ్ క్వీనే.. కానీ జనాలు ఆమె జోలికి పోవాలంటే భయపడి చస్తున్నారు.  ఈమధ్య అలియా భట్ ను గట్టిగానే విమర్శించింది కంగనా. కాకపోతే అలియా లౌక్యంగా సమాధానమిచ్చి వివాదాన్ని జటిలం చేయకుండా తప్పించుకుంది.  కానీ రీసెంట్ గా రంగోలి చందేల్ అలియా ను.. అలియా తల్లిగారు సోని రజ్దాన్ ను విమర్శించింది.  అసలు వీళ్ళు ఇండియన్స్  కారని.. బ్రిటిష్ పౌరసత్వం ఉందని అంటూ ఇంకా ఏవేవో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాజాగా అలియా సండేస్ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ ఈవెంట్ కు హాజరు కాగా అక్కడ రిపోర్టర్స్ ఈ విమర్శలపై స్పందన ఏంటని అడిగారు.

వారికి అలియా సమాధానం ఇస్తూ.. "నా కుటుంబం నాకంటే పది రెట్లు బలమైనది పరిణతి కలిగింది. అందుకే నేను ఇందులోకి దిగదలుచుకోలేదు.  నేను హ్యాపీగా.. పాజిటివ్ గా.. ఉండదలుచుకున్నాను.  రోజు రోజుకు నన్ను మరింతగా మెరుగుపరుచుకోదలుచుకున్నాను.  అందుకే ఇలాంటి విషయాలను.. జనాల అభిప్రాయాలను పట్టించుకోకూడదని ఒక స్టాండ్ తీసుకున్నాను. ఎవరికి తోచినట్టు మాట్లాడే హక్కు వారికుంది.  నేను మాత్రం కామ్ గా ఉంటాను. నా స్టాండ్ ఇదే." అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.  అంటే ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి.. మే నోరు మీ ఇష్టం. అంటోంది.  ఎవరికి పరిణతి ఉందో.. ఎవరు అనవసరంగా ఇష్యూ ను పెద్దది చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?
    

Tags:    

Similar News