ఈ బాలీవుడ్ వయ్యారి రాజమౌళి నమ్మకాన్ని నిలబెడుతోందా..??

Update: 2020-12-25 06:30 GMT
ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ కథనాయకులుగా నటిస్తున్నారు. రౌద్రం రుదిరం రణం పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు. ఇక రాంచరణ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభించిన ఆర్ఆర్ఆర్ టీమ్.. అలియాతో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిందట. ఇక ఈ సినిమాతోనే అలియా భట్ తెలుగు తెరకు పరిచయం కానుంది. అయితే అలియాకి తెలుగు బాష అసలు రాదన్న సంగతి తెలిసిందే. కానీ అమ్మడు షూటింగులో తెలుగు డైలాగులు చకచకా చెప్పేస్తుందట. మరి అలియాకి ఇంత తెలుగు ఎక్కడి నుండి వచ్చింది అంటే.. దాదాపు ఏడాదిన్నర కాలంగా అలియా ఆర్ఆర్ఆర్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తుందట.

అందుకే ఇప్పుడు అలవోకగా తన డైలాగ్స్ చెబుతుందని తెలుస్తుంది. ఈ విషయం స్వయంగా అలియానే చెప్పడం విశేషం. 'ఆర్ఆర్ఆర్ తనకు సరికొత్త అనుభవం. షూటింగ్ లో జాయిన్ అయ్యే ముందే డైలాగ్స్ అన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తా అంటోంది సొట్టబుగ్గల చిన్నది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా సీత క్యారెక్టర్ పోషిస్తుంది. ఆ క్యారెక్టర్ కోసం అలియాను ఎందుకు ఎంచుకున్నారో ఇదివరకే రాజమౌళి చెప్పేసాడు. 'ఆర్ఆర్ఆర్ లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లేనప్పటికీ.. సీత పాత్ర సినిమాకి చాలా ముఖ్యమని, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలతో పోటీపడి సీత క్యారెక్టర్ ఎమోషన్స్ పండించాలని..  సీత అమాయకురాలు కానీ స్ట్రాంగ్ లేడీ. అంత ప్రాముఖ్యత గల పాత్ర కాబట్టే ఆలియాను ఎంపిక చేసినట్లు' తెలిపాడు. తన నమ్మకాన్ని నిలబెట్టే సత్తా అలియాకి ఉందని రాజమౌళి తెలపడం విశేషం. అందుకే అమ్మడు డైలాగ్స్ గాని సీన్స్ విషయంలో గాని చాలా జాగ్రత్త పడుతుందట. చూడాలి మరి అలియా మ్యాజిక్ ఎలా ఉండబోతుందో..!!
Tags:    

Similar News