ఫొటో స్టోరీ: అందాల మత్స్యకన్య

Update: 2019-10-20 14:30 GMT
బాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌. ఈమె పలు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈమె ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో చరణ్‌ కు జోడీగా కూడా నటిస్తుంది. హీరోయిన్‌ గా చాలా బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇటీవల జరిగిన వోగ్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2019 కోసం మత్స్యకన్య అవతారం ఎత్తింది. అండర్‌ వాటర్‌ ఫొటో షూట్‌ తో ఈ అమ్మడు వోగ్‌ మ్యాగజైన్‌ పై కనిపించింది. వాటర్‌ లో మత్స్యకన్యలా ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నాకు మత్స్యకన్యలా ఉండాలని ఉంది. నాకు లోతు భయం లేదు మరియు నిస్సారమైన జీవితానికి సంబంధించి కూడా నాకు ఎలాంటి భయం లేదు అంటూ ఆలియా భట్‌ ఈ ఫొటోను పోస్ట్‌ చేసి కామెంట్‌ పెట్టింది. దీనికి నెటిజన్స్‌ నిజంగా మత్స్య కన్యలు ఉంటే నీలాగే.. ఇలాగే ఉంటారేమో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వోగ్‌ మ్యాగజైన్‌ పై గతంలో పలు సార్లు కనిపించిన ఆలియా భట్‌ ఈసారి చాలా ప్రత్యేకంగా ఉందని బాలీవుడ్‌ వర్గాల వారు కూడా అంటున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆలియా భట్‌ మత్స్యకన్య లుక్‌ పై మీరు ఒక లుక్కేయండి.
Tags:    

Similar News