ప్రస్తుతం దేశవ్యాప్తంగా కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్న సినిమాలలో 'ఆర్ ఆర్ ఆర్' ఒకటి. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. స్వాతంత్ర్యానికి ముందు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీంల జీవిత కథలను ఎంచుకొని సినిమాగా మలుస్తున్నారు జక్కన్న. ఇప్పటికే 70శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది.
ఎంతో పకడ్బందీగా తెరకెక్కిస్తున్న ఈ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తుండగా - కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి చిత్రం కావడంతో సినీ అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మేరీస్ నటిస్తుంటే - రాంచరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుంది. అలియా భట్ ఈ చిత్రంతో సౌత్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కానుంది.
అయితే అలియా భట్ సడన్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి తప్పుకున్నట్లు నెట్టింట ఒక వార్త వైరల్ అవుతోంది. కారణం ఏమిటంటే ప్రస్తుతమున్న బిజీ షెడ్యూల్ వల్ల ఆర్ ఆర్ ఆర్ కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందట. ఎందుకంటే ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాలకు డేట్స్ కేటాయించానని చెప్తుందట. కరోనా కారణంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా పడింది కనుక డేట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉందంట అలియా. ఇచ్చిన డేట్స్ ఏమో ఈ కరోనా సెలవులలో ముగుస్తాయట. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే.. అలియా నోరువిప్పే వరకు వేచి ఉండాలేమో..!