తండ్రి తీరుతో అలియాభట్ అప్ సెట్

Update: 2019-12-09 04:35 GMT
బాలీవుడ్ అందాల బొమ్మ అలియాభట్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. అందానికి అందం.. అంతకు మించిన అభియంతో పాటు.. సామాజిక అంశాల మీదా..ఇతర విషయాల మీద తన అభిప్రాయాల్ని నిక్కచ్చిగా చెప్పే ఈ తరం నటిగా ఆమెకు మంచి పేరుంది. తండ్రి కమ్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమ్ దర్శకుడు మహేశ్ భట్ సినీ వారసత్వంగా ఆమె వెండితెరకు పరిచయమైనా.. అనతికాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు.

ఇప్పటికే పలు విజయవంతమైన హిందీ సినిమాలు చేసిన ఆమె తొలిసారి తెలుగులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న  RRRలో రాంచరణ్ తో జత కట్టింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తండ్రి మహేశ్ భట్ తో పాటు ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
మహేశ్ మరో కుమార్తె షాహిన్ భట్ తనకు జరిగిన మెంటల్ ఇల్ నెస్ మీద ఒక పుస్తకాన్ని రాసింది. దీన్ని లాంఛ్ చేసే కార్యక్రమానికి హాజరైన మహేశ్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సహనం కోల్పోయారు. మీడియా మీద పెద్దగా అరిచేశారు. దీన్నేమాత్రం ఊహించని అలియా తండ్రి పనికి అవాక్కు అయ్యారు.

తండ్రి అరుస్తున్న వేళ.. అలియా ఆయన్ను వారించే ప్రయత్నం చేస్తూ.. శాంతించాలంటూ సైగలు చేసినా మహేశ్ మాత్రం పట్టించుకోలేదు. దీంతో.. ఆమె కొద్దిపాటి ఇబ్బందికి గురయ్యారు. తండ్రి తీరుతో అన్ కంఫర్ట్ బుల్ గా మారిన ఆమెకు చెందిన పొట్టి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags:    

Similar News