'ఆర్ఆర్ఆర్' సినిమాకు స్క్రిప్టు పూర్తి కాకముందే ఆ సినిమాకు కథానాయకులుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఖరారైపోయారు. కానీ ఈ సినిమా కథానాయికల వ్యవహారమే ఎంతకీ తేలట్లేదు. సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్న కొన్ని నెలలకు ఇందులో ఓ కథానాయికగా ఆలియా భట్‌ను, మరో కథానాయికగా ఓ బ్రిటిష్ అమ్మాయిని ఖరారు చేశారు. ఆ తర్వాత ఆ బ్రిటిష్ నటి తప్పుకోవడం తో తకరారు మొదలైంది. కొన్ని నెలల అన్వేషణ తర్వాత ఒలీవియా మోరిస్‌ను రెండో హీరోయిన్‌గా ఖరారు చేశారు. కానీ ఇప్పుడు ఆలియా భట్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 'ఆర్ఆర్ఆర్'కు కేటాయించిన డేట్లు కరోనా వైరస్ వల్ల షూటింగ్ రద్దవడం తో వృథా అయిపోయాయి. దీంతో తర్వాత 'బ్రహ్మాస్త్ర' సినిమా కోసం పని చేయాల్సి ఉండటం తో ఈ చిత్రానికి డేట్లు సర్దుబాటు చేసే అవకాశం లేక ఆమె తప్పుకుందని అంటున్నారు.
ఐతే ‘ఆర్ఆర్ఆర్’లో నటించడం ఎంత పెద్ద అవకాశం అన్నది ఆలియా గుర్తించలేకపోతే ఆమెకు ఆమె చేటు చేసుకున్నట్లే. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి సినిమాలు బాలీవుడ్లో ఇంకెన్నో రావచ్చు. హిందీలో ఆమె కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఒక సినిమా పోతే ఇంకో సినిమా ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులే చేతికి వస్తాయి. 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమా మాత్రం అన్నిసార్లూ రాదు. 'బాహుబలి'తో ఇండియాలో మరే దర్శకుడికీ సాధ్యం కాని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు రాజమౌళి. ఆయన తర్వాతి సినిమా కోసం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన సినిమాలో నటిస్తే వచ్చే పాపులారిటీనే వేరు. ఒక్కసారిగా దేశం మొత్తం పాపులారిటీ వస్తుంది. దక్షిణాది ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశముంది. ఇక్కడ మార్కెట్ పెరుగుతుంది. దాని వల్ల ఆలియా నటించే తర్వాతి సినిమాలకు చాలా మేలు జరుగుతుంది. ఆమె మార్కెట్ విస్తరిస్తుంది. పారితోషకం కూడా పెరుగుతుంది. అన్నింటికీ మించి ఈ సినిమాతో వచ్చే గుర్తింపుకు మరేదీ సాటి రాదు. అలాంటిది డేట్లు సర్దుబాటు చేయలేక ఈ సినిమాను వదులుకోవడం అన్నది తెలివి తక్కువ పనే అవుతుంది. ఈ విషయంలో ఆలియాకు కరణ్ జోహార్ లాంటి వాళ్లయినా చెప్పాల్సిందేమో.